శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వైభవంగా అయ్యప్పస్వామి నగరోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, డిసెంబర్ 28: వేదాయపాళెం వద్ద ఉన్న అయ్యప్ప దేవస్థానంలో మండల పూజలు ముగింపు సందర్భంగా సోమవారం శ్రీ అయ్యప్ప నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని విశేషంగా అలంకరించి అయ్యప్పగుడి నుండి నవాబుపేటలోని మల్లికార్జునస్వామి ఆలయం వరకు ఊరేగించారు. సాయంత్రం అక్కడ నుండి అతి వైభవంగా అయ్యప్ప నగరోత్సవాన్ని నిర్వహించారు. కేరళ మంగళ వాయిద్యాల నడుమ బాణసంచా పేలుస్తూ చేపట్టిన నగరోత్సవం విశేషంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూలాలంకరణ చేశారు. విద్యుత్ దీపాలంకరణ, అర్కెస్ట్రా వారి భక్తిగీతాలతో అయ్యప్ప భక్తుల ఆటపాటలతో కోలాహలంగా ఈ నగరోత్సవం జరిగింది. నవాబుపేట శివాలయం నుండి బయలుదేరిన ఉత్సవం ఆత్మకూరు బస్టాండు, రాజేశ్వరి గుడి మీదుగా అయ్యప్ప దేవస్థానం వరకు కొనసాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలో స్థానిక మహిళలు ఊరేగింపు సందర్భంగా స్వామివారిని దర్శించేందుకు రోడ్డుపై క్యూకట్టి స్వామి వారిని వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పిటి రంగరాజన్, ఈఓ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు.

జన్మభూమిని జయప్రదం చేయండి:ఆర్డీఓ
ఆత్మకూరు, డిసెంబర్ 28: జన్మభూమి-మా ఊరు కార్యక్రమం వచ్చే నెల 2 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న దృష్ట్యా విజయవంతం చేయాలని ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎంవి రమణ పిలుపునిచ్చారు. సోమవారం ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయంలో జన్మభూమి- మా ఊరుపై వీడియో కాన్ఫరెన్స్, సమీక్షా సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు తప్పక ఈ కార్యక్రమాలకు హాజరుకావాలన్నారు. ప్రతి చోటా ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని సూచించారు. జన్మభూమి కమిటీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వీలైన సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించాలని సూచించారు.