నెల్లూరు

ఎట్టకేలకు రిజర్వాయర్ నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపురం, ఏప్రిల్ 3: గత నెల రోజులుగా మండలంలోని రాళ్లపాడు రిజర్వాయర్ ఆయకట్టుదారులు ఎదురుచూస్తున్న సాగునీటిని ఆదివారం అధికారులు విడుదల చేశారు. ఇందుకోసం రైతులు ఎన్నో ఉద్యమాలు చేశారు. నిరాహార దీక్షలకు సైతం దిగారు. రిజర్వాయర్ అధికారులు, కందుకూరుకు చెందిన ఒక నాయకుడు తాను, తన అనుచరగణం రిజార్వాయర్‌లో పెంచుతున్న చేపల కోసం తాగునీటి సాకు చూపి నీటిని విడుదల చేయకుండా నిలిపివేశారు. దీంతో సుమారు 1500 ఎకరాల్లో పంట ఎండిపోగా మరో 2వేల ఎకరాల్లో ఇప్పటికే వరిని కోసేసారు. ఇంకా 1500 ఎకరాలకు మాత్రమే సాగునీరు అవసరం. ఈ నేపధ్యంలో ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని ఇక్కడ రైతులు చివరితడి నీటికోసం పడుతున్న అవస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి దేవినేని దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ జానకి కూడా 15రోజుల క్రితం రిజర్వాయర్‌ను, ఎండిపోతున్న పంటలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో ఎట్టకేలకు ఆదివారం సాగునీరు విడుదలైంది. ఇదే నీటిని 10 రోజుల ముందు విడుదల చేసి ఉంటే మొత్తం 5వేల ఎకరాలకు సాగునీరు సక్రమంగా అంది రైతులకు ఎంతో మేలు జరిగి ఉండేది. ఇప్పుడు నీటిని వదిలినా ఇందులో వరిపంటకు కొంతే చేరుతుంది. ఎక్కువనీరు ఆయకట్టుపరిధిలోలేని మెట్టపొలాలకే వెళ్తుందని రైతులు అంటున్నారు. ఆ పొలాలకు నీటికోసం సిద్ధం చేసిన ఇంజన్లను తొలగించకుంటే వంద ఎకరాల వరిపంటకు కూడా నీరు అందదు. ఇంతచేసినా ప్రధానకాలువ నుండి ఇంజన్ల ద్వారానే వరిపంటకు నీటిని తరలించాల్సి ఉంది.