శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అతిగా మద్యం సేవించి ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 27: ఓ గుర్తు తెలియని 40 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి నగరంలోని బొల్లినేని ఆసుపత్రి సమీపంలో శుక్రవారం ఫూటుగా మద్యం సేవించాడు. అనంతరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయాడు. రోడ్డుపై వెళుతున్న పాదచారులు గమనించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడకు చేరుకొని బాధితుడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెంది ఉండటంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ వ్యక్తి తెల్ల చొక్కా, తెల్ల పంచె ధరించి ఉన్నాడు.