శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రోజుకో పుకారు పుడుతున్న వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 7: ఇప్పటికే గత ఆరు నెలల వ్యవధిలో సుమారు పాతికకు పైగా భూప్రకంపనలను చవిచూశారు. ఇప్పటిదాకా తీవ్రత లేకున్నా, రాబోయే రోజుల్లో పరిస్థితి ఏమిటని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అటువంటి వారిలో మనోధైర్యం కల్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కానీ అధికారుల చర్యలకు ఆటంకం కలిగించేలా రోజుకో కొత్త పుకారు ఆ ప్రాంతంలో పుట్టుకొస్తోంది. ఈనెల 9వ తేది తీవ్ర భూకంపం వస్తుందంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నట్లు అధికారుల దృష్టికి కూడా వచ్చింది. దీనిపై ఇప్పటికే ప్రభావిత గ్రామాలన్నింటిలోనూ అధికారులు దండోరా వేయించి ఎటువంటి ప్రమాదం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా కల్పిస్తున్నారు. అయితే ప్రజల్లో దాగిన మూఢనమ్మకాలో పుకార్లకే ప్రాధాన్యమిస్తూ కొందరు తమ ఇళ్లను ఖాళీ చేసి బంధువుల ఊళ్లకు వెళ్లిపోతున్నారు. గ్రామాల్లో మహిళలకు ఒంట్లోకి పూనకాలు రావడం పెరిగిపోయింది. ‘ ఆ తప్పు చేశారు, అందుకే నాకు కోపం వచ్చింది, మొక్కులు తీర్చుకోండి’ అంటూ వారు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. గత వారం రోజులుగా వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల పరిధిలో వాతావరణం ఇలానే కనిపిస్తోంది. వారిలో భరోసా కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చేయని కార్యమంటూ లేదు. చివరకు ఎన్‌జిఆర్‌ఐ శాస్తవ్రేత్త నగేష్ ప్రభావిత ప్రాంతాలను మంగళవారం సందర్శించి గ్రామస్థుల సమాధానాలకు సవివరంగా సమాధానం ఇచ్చి వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వచ్చిన భూకంపాల వల్ల ఎటువంటి ప్రమాదం లేదనీ, ప్రమాదం కలిగించే స్థాయి భూకంపాలు ఈ ప్రాంతంలో వచ్చే అవకాశాలు లేవని అన్నారు. అయినా భూప్రకంపనల ప్రభావాన్ని గత కొన్ని నెలలుగా కంటూ, వింటూ ఉన్న స్థానికులు అధికారుల మాట వింటున్నట్లు కనిపిస్తున్నా లోలోన భయాందోళనతోనే ఉన్నారు. స్థానికంగా విద్యావంతులు కొందరు వారికి అవగాహన కల్పించే పనిలో పడ్డారు. జిల్లా యంత్రాంగం, భూకంప శాస్తవ్రేత్తల సూచనలను పరిగణనలోకి తీసుకుని పుకార్లకు విలువివ్వకుండా స్థానికులు నిబ్బరంగా ఉండాల్సిన అవసరం ఉంది.