నెల్లూరు

దాతలూ...నా ప్రాణాలు కాపాడండి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, ఏప్రిల్ 3: తాను ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి ఉద్యోగ వేటలో వుండగా నయం కాని హుద్రోగానికి గురికాగా గుండెమార్పిడితో వ్యాధి నయమవుతుందని వైద్యులు చెప్పారని కొండాపురానికి చెందిన చిమ్మిలి హరిబాబు అనే యువకుడు చెప్పాడు. ఆదివారం పట్టణంలోని ప్రజావైద్యశాల వైద్యులు డాక్టర్ ప్రభాకర్‌నాయుడు, వారి బంధువులతో కలిసి విలేఖర్లతో మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి తన ప్రాణాలను కాపాడాలని వేడుకున్నాడు. క్రీడల్లోనూ చాంపియన్‌గా వున్న తాను 80శాతం ఉత్తీర్ణతతో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుని ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్ళినట్లు అక్కడ గుండెనొప్పితో బాధపడుతూ వైద్యశాలకు వెళ్ళగా అరుదైన కార్నియో మాయమతి (గుండె పెరుగుతుండటం) వ్యాధికి గురైనట్లు అక్కడి వైద్యులు చెప్పారని తెలిపారు. అయితే దీనికి గుండెమార్పిడి ఒక్కటే పరిష్కారమని చెప్పగా తాము కొంతమంది సలహాలతో డాక్టర్ ప్రభాకర్‌నాయుడును ఆశ్రయించగా ఏడాదిగా ఆయన తన స్వంత నిధులతో ఔషధాలను అందచేస్తున్నారని వివరించారు. గుండెమార్పిడికి 50లక్షల రూపాయలు అవసరమవుతాయని ఆ తర్వాత ప్రతినెల 25వేల రూపాయల వంతున జీవితాంతం మందుల కోసం ఖర్చు అవుతుందని నిపుణులు తెలిపారని చెప్పారు. అయితే ప్రఖ్యాత హుద్రోగ వైద్యులు గోపాలకృష్ణ గోకలే తన ట్రస్టు ద్వారా 25లక్షల రూపాయలు సమకూర్చడంతో పాటు వైద్య సేవలను కూడా పర్యవేక్షిస్తానని ముందుకొచ్చారని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 14లక్షలు అందించేందుకు అంగీకరించిందని వివరించారు. మార్పిడికి మరో 11లక్షలు అవసరం కాగా అనంతరం నిర్వహణకు ఏడాదికి 3లక్షల రూపాయల వంతున అవసరం అవుతుందని చెబుతూ దాతలు ముందుకు రావాలని ప్రాణాన్ని కాపాడాలంటూ వేడుకొన్నారు. అనంతరం డాక్టర్ ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ బాధితుడు హరిబాబు కుటుంబం అతినిరుపేద స్థితిలో వుందని కష్టించి పనిచేసి వచ్చిన డబ్బుతో అతని తల్లిదండ్రులు చదివించారని ఈదశలో అనుకోని జబ్బు వచ్చి పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. అతనిని బతికించి వారి కుటుంబ సభ్యుల ఆకాంక్షను నెరవేర్చాల్సిన మానవీయ బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని తమ వంతు అందరు సహకరించాలని ఎవరైనా దాతలు తమ వైద్యశాలలో తనను సంప్రదించాలని వివరించారు. ఒక్క ప్రాణాన్ని కాపాడితే వారి కుటుంబాన్ని మొత్తం కాపాడినట్లేనని నిజమైన దాతృత్వాన్ని చూపాలంటూ విన్నవించారు.