శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 10: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, టిడిపి నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రంగనాయకులపేట శ్రీతల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఆయన అభిమాన సంఘ నాయకుడు ఎస్ సుబ్బారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌రెడ్డి పాల్గొని భారీ కేక్ కట్ చేసి, అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులు బాణా సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలకృష్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. దివంగత నేత నందమూరి తారకరామారావు ఆశయాలను ముందుకు తీసుకెళుతూ ప్రజా రంజక కార్యక్రమాలను బాలకృష్ణ నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జడ్ శివప్రసాద్, దాసరి రాజేష్, డి. సుబ్బారావు, వైవి సుబ్బారావు, నూనె మల్లికార్జునయాదవ్, పి శైలజ, ఏ సుధాకర్, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, రాజానాయుడు, పెంచలయ్య నాయుడు, ఎం మధు పాల్గొన్నారు.