నెల్లూరు

సబ్ రిజిస్ట్రార్‌కు రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 3: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్ రిజిస్ట్రార్‌కు రిమాండ్ విధించారు. శనివారం సబ్ రిజిస్ట్రార్ నందకిషోర్ ఇంటిలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి అక్రమ ఆస్తులను సంపాదించినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు.

బాయిలర్‌లో లోపాలు సరిచేశాం
* ఎపిజెన్‌కో ప్రాజెక్టు డైరెక్టర్ సుందర్‌సింగ్ వెల్లడి
ముత్తుకూరు, ఏప్రిల్ 3: ఎపి జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో 1, 2 యూనిట్లకు సంబంధించి బాయిలర్‌లోని లోపాలను సరిచేశామని, సోమవారం నుంచి యథావిధిగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని ప్రాజెక్టు డైరెక్టర్ సుందర్‌సింగ్ వెల్లడించారు. ఆదివారం జెన్‌కో పరిపాలన భవనంలో ఎపి జెన్‌కో ఇంజనీర్లు భాగస్వామ్య కంపెనీలతో సమావేశమై బాయిలర్‌లో నెలకొన్న లోపాలపై సమీక్ష జరిపి లోపాలను సరిచేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ బాయిలర్ ట్యూబ్‌లు, ఐడి బాల్బులు మార్చినట్లు చెప్పారు. మున్ముందు ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా చూడాలని జెన్‌కో ఇంజనీర్లుకు ఆయన సూచించారు. విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఇలాంటి సాంకేతిక లోపాలు సహజంగా ఉంటాయని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్లు సత్యనారాయణరావు, ఎస్‌ఇలు రమణారెడ్డి, దేవప్రసాద్ తదితరులు ఉన్నారు.

పోలీసుల అదుపులో క్రికెట్ బుకీ
పొదలకూరు, ఏప్రిల్ 3: స్థానికంగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారనే ఆరోపణపై శ్యామ్ అనే వ్యక్తిని నెల్లూరు ఐడి పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని తమ వెంట నెల్లూరుకు తీసుకెళ్లి రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని క్రికెట్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపే క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.