శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నీటి బుడగల్లా ఐఏబి తీర్మానాల్లో నిర్మాణ అంశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూన్ 13 : ఐఏబి (ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు)లో తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, తీర్మానాలను అనుసరించి పురోగతి కరవవ్వడంపై రైతాంగంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఏటా విధిగా లేట్ ఖరీఫ్, రబీ (ఎడగారు) పంటలపరంగా ఐఏబి భేటీ ఆనవాయితీ. అయితే అక్కడ నీటి విడుదల తీర్మానాలకే తప్ప అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాల్లో ఆ తరువాత రోజుల్లో కదలిక లేకపోవడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు. ఐఏబి సమావేశంలో ప్రజా, రైతు, సాగునీటి ప్రతినిధులు హాజరవుతారు. వివిధ శాఖల అధికార యంత్రాగం ముందస్తుగా అవకాశాలను అనుసరించి నిర్ణయించిన ప్రతిపాదనలపై ఐఏబిలో చర్చించి ఆమోద ముద్ర వేస్తుంటారు. అయితే ఇదే సమావేశాల్లో భాగంగా తీసుకునే విడుదలకు సంబంధించిన వ్యవహారాలపై మాత్రమే కార్యాచరణ స్పష్టంగా కొనసాగుతుంది. నీటి వనరుల నిర్మాణపరమైన అంశాలపై ముందడుగు ఆశాజనకంగా పడటం లేదు. నీటి విడుదల ముందుగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సందర్భంలో విడుదలకు ఎదురయ్యే ఆటంకాలు ఉంటే తాత్కాలిక పద్ధతిలో అప్పటికప్పుడు పరిష్కరించడం పరిపాటి. అవే సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు మాత్రం పగడ్బందీ ప్రణాళికతో కొనసాగాల్సి ఉంది. నీటి విడుదల ముంగిట జరిగే సందర్భంలో మాత్రమే ఈ సమావేశాలు జరగడం వల్ల అప్పటికయ్యేది తాత్కాలికమే. కాగా, రెండో పంటకు సంబంధించి సోమశిల జలాలు నాన్ డెల్టా ప్రాంతానికి విడుదల జరగడం ఆనేది ఇంతవరకు ఎన్నడూ జరగలేదు. ఎండాకాలంలో కొనసాగే రెండోపంట సమయంలో నీటి విడుదల అంటూ ఎరుగని నాన్ డెల్టా ప్రాంతంలో కాలువలు, ఇతర సమస్యలను శాశ్వత రీతిలో సమగ్రంగా పరిష్కరించడం సముచితం. ఇవే అంశాలపై కూలంకుశ చర్చలు సాగి తీర్మానిస్తున్నా వాస్తవచిత్రంలో మాత్రం పురోగతి కరవు. దీంతో ఏటేటా సోమశిల జలాశయం నుంచి విడుదలయ్యే రాశితో సరిపోలిస్తే ఆ నీరు కాలువల్లో పక్కదారి పట్టడం, లీకేజిలు, ఇతర కారణాలతో రైతుల దరి చేరే పరిమాణం చాలా వ్యత్యాసంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు పాత గణాంకాలను పరిగణలోకి తీసుకుంటూ, ఒక్క టిఎంసి (శతకోటి ఘనపుటడుగుల) నీటి నిల్వను 14వేల ఎకరాల వరిపంట సాగుకు సంబంధించి పంపిణీ చేసేలా ఐఏబిలో తీర్మానిస్తున్నారు. అయితే పంట మధ్య, చివరి దశలకు చేరుకున్న తరుణంలో సాగునీటి కసరత్తు చాలా కష్టతరంగా మారుతోంది. ఇందుకోసమై పలు పర్యాయాలుగా కలెక్టర్, ఇరిగేషన్ ఉన్నతాధిరులు సమీక్షించి తగు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక టిఎంసి నీరు 11నుంచి 12వేల ఎకరాలకు సరిపోయే శాస్ర్తియ అవకాశాలుంటే 14వేల ఎకరాలకు నిర్ణయిస్తుండటాన్ని ఉద్దేశించి పలువురు రైతు నేతలు నిష్టూరం వ్యక్తపరుస్తున్న దాఖలాలు కూడా అనేకం. అధికారులు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలా నీటి విడుదలలోనే అధిక పరిమాణం చూపుతున్నారనే ప్రచారం ఉంది. ఇరిగేషన్ నిపుణులు అలా తప్పిదం చేయడం వల్ల సాగునీటి పంపిణీపరంగా అనేక లోటుపాట్లకు తావిస్తోందని గత కలెక్టర్లు సైతం అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వం పిలుపునిచ్చిన జలయజ్ఞం పథకం కింద వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. అయితే ఏళ్ల తరబడి ఈ పనుల్లో జాప్యం జరుగుతున్నా ఐఏబి సమావేశంలో సరైన చర్చలు, తీర్మానాల్లో పురోగతి లేకపోవడం ఎంతైనా దారుణ పరిణామం. ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు అపరిష్కృతంగా మారడంతో సహా వివిధ ప్యాకేజిలు రద్దుకావడం తెలిసిందే. పెన్నాడెల్టా పరిధిలో నిర్దేశించిన ప్యాకేజిలకు తగ్గట్లుగా భారీ యంత్ర సామగ్రి సమకూర్చుకునేందుకు అవసరమైన మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు సేకరించుకుని దశాబ్ధకాలం దాటినా పనుల పురోగతి ఆశాజనకంగా లేదు. మూడేళ్లలోపు పూర్తికావాల్సిన సోమశిల ఉత్తర కాలువ ఆధునీకరణ, విస్తరణ పనులు పదేళ్లు దాటినా ఒక కొలిక్కి రాకపోవడం శోచనీయం. ఇలాంటి వివిధ అంశాలపై సమగ్ర చర్చలతో అమలయ్యేలా తీర్మానాలు లేకపోవడం నెల్లూరు రైతాంగం పాలిట ఎంతైనా శాపమే. ఎంత లేదన్నా మరో నాలుగు నెలల్లోగా సంగం, ఇంకో ఐదారుమాసాల్లో నెల్లూరు బ్యారేజిల నిర్మాణాలు పూర్తవుతాయని పాలక పెద్దలు సెలవిస్తున్నారు. సదరు ప్రభుత్వ అధిపతులు ప్రకటించినట్లుగా ఆశాజనకమైన పరిస్థితులు ఏర్పడితే జిల్లా రైతాంగానికి ఎంతో మేలైన ప్రయోజనాలు ఒనగూరుతాయనే చెప్పాలి.