శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నిలువు దోపిడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 14: విద్యారంగంలో ప్రైవేటు పాఠశాలలు దుకాణాలుగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పెన్ను, పుస్తకం, యూనిఫాం వరకు ఆవరణలోనే అమ్మకాలు జరుపుతున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యారు. విద్యార్థులు వారికి అవసరమైన యూనిఫాం తమ పాఠశాలలోనే కొనుగోలు చేయాలనే నిబంధనలు విధిస్తున్నారు. బయట దుకాణదారులు అమ్ముతున్న ధరలకు, పాఠశాలలో అమ్ముతున్న ధరలకు చాలా వ్యత్యాసం ఉండటంతో తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. అనుమతులు లేని దుకాణాలు ఏర్పాటుచేసి అధిక ఆదాయం పొందుతు ప్రభుత్వానికి వాణిజ్య పన్ను ఎగవేస్తున్నారు. ఈ తతంగం అంతా ఉన్నతాధికారులకు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పది మందికి అక్షరాలు నేర్పాల్సిన ఆవరణలో వ్యాపారాలు చేస్తూ విద్యా వ్యవస్థను అవహేళన చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా యూనిఫాంతో పాటు ఇతర విద్యా సామగ్రి వ్యాపారం కోట్లాది రూపాయలు మేర జరుగుతుంది. వర్తక సంబంధమైన పన్నును ప్రభుత్వానికి కట్టకుండా లోలోపల వ్యాపారం చేస్తున్నారు. ముందు వ్యాపార దుకాణానికి వాణిజ్య పన్నుల శాఖ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వీటికి సుమారుగా 15వేల రూపాయలు ఖర్చు అవుతుంది. రెడీమెడ్ దుస్తుల వ్యాపారానికి నెలకు లక్ష వ్యాపారం చేస్తే 5 వేల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాలి. అవి ఏమీ చెల్లించకుండా ఎగవేస్తున్నారు. జిల్లాలో సుమారు 2 వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు సంబంధించిన దుస్తులు దగ్గర నుంచి పెన్ను వరకు ఆయా పాఠశాలల యాజమాన్యాలే అమ్మకాలు సాగిస్తున్నాయి. ఈవిధంగా చేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికభారం తడిచి మోపెడవుతోంది. ఒకవేళ విద్యార్థులు యూనిఫాంను బయట కొనుగోలు చేస్తే ఆ రంగు తేడా ఉందని ఏదోఒక కుంటిసాకు చెప్పి తిరిగి వాపసు ఇచ్చేంతవరకు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పాఠశాల యాజమాన్యాలు మాత్రం నాశిరకం దుస్తులు తెచ్చి వారు చెప్పిన రేటుకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఒకపక్క ఫీజులు అధికంగా వసూలు చేస్తూ మరో దుస్తులు, పుస్తకాల పేరుతో తల్లిదండ్రుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జూన్ నెల వచ్చిందంటే విద్యార్థుల ఫీజులతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ఫీజుల నియంత్రణ చేయాల్సిన పలువురు అధికారులు ప్రైవేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతూ వారు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.