శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

‘ఆర్టీసీకి రూ. 8కోట్ల నష్టం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాకాడు, జూన్ 23: జిల్లాలో ఉన్న పది ఆర్టీసీ డిపోలు ప్రస్తుతం నష్టాల్లో ఉన్నట్టు రీజనల్ మేనేజర్ డి మహేశ్వర్ వెల్లడించారు. గురువారం మండల కేంద్రంలో ఉన్న ఆర్టీసీ డిపోను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి గ్యారేజి కార్మికులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఓఆర్ గణనీయంగా పడిపోయిందన్నారు. పది డిపోల ద్వారా ప్రస్తుతం 8 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. నష్టాలను అధిగమించేందుకు ప్రతి డిపో ద్వారా నూతన సర్వీసులు ప్రారంభిస్తున్నామని, ప్రయాణికుల సౌకర్యం కోసం వారి సూచనల సలహాల మేరకు సర్వీసులు మారుస్తున్నట్టు తెలిపారు. వాకాడు డిపో నుండి ప్రకాశం జిల్లా పామూరుకు నూతన సర్వీసును ప్రారంభించామని, ప్రయాణికుల నుండి మంచి స్పందన వస్తుండటంతో ఆ మార్గంలో మరికొన్ని బస్సులు నడుపుతామన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రతి డిపోలో కార్గో సర్వీసులు ప్రారంభించామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హైదరాబాద్, ముంబై తదితర పట్టణాలకు కార్గో సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. తిరుమలకు వెంకటగిరి నుండి మాత్రమే బస్సులను ఏర్పాటు చేశామని, జిల్లాలో తిరుమలకు వెంకటగిరి డిపో దగ్గరగా ఉన్న దృష్ట్యా అక్కడ నుండి మాత్రమే నేరుగా తిరుమలకు బస్సులు నడపుతున్నామని, గూడూరు నుండి మాత్రం రైలు వేళలకు అనుగుణంగా రైల్వే స్టేషన్ నుండి తిరుమలకు నడుపుతామన్నారు. ప్రస్తుతం కెఎంపిఎల్ 5.4 ఉందన్నారు. ఈ నెల 13 నుండి ఓఆర్ గణనీయంగా పడిపోయిందన్నారు. నెల్లూరు 2వ డిపోలో నష్టాలు అధికంగా వస్తున్నాయన్నారు. ఆయన వెంట డిఎం ముక్తేశ్వరరావు ఉన్నారు.