శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అర్హులైన ఉపాధి కూలీల అకౌంట్లలో వేతనాలు జమచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 24: జాతీయ ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు అర్హులైన కూలీలకు వేతనాలు వారి అకౌంట్లలో జమ చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు ఎం జానకి ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ బంగ్లాలో ఉపాధి హామీ అమలు, కూలీల వేతనాల చెల్లింపులపై ఉపాధి, బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 6.5 లక్షల మంది కూలీలకు జాబ్‌కార్డులు అందించినట్లు చెప్పారు. అందులో 2.5 లక్షల మంది కూలీలకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారని, మిగిలిన 4 లక్షల మంది కూలీలకు ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కార్యక్రమం ద్వారా జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేసేందుకు గ్రామాల వారీగా బ్యాంకు అధికారుల సమన్వయంతో క్యాంప్ కార్యక్రమాలు నిర్వహించి పూర్తిస్థాయిలో అకౌంట్లు ఉండేలా చూడాలన్నారు. ఈ ప్రక్రియలో జులై 4 నుండి గ్రామస్థాయిలో క్యాంపులు నిర్వహించి అర్హులైన కూలీలందరికీ అకౌంట్లు ప్రారంభించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అకౌంట్ల ప్రారంభ కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు బిజినెస్ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసి, ఆయా గ్రామాలవారీగా అవగాహన కల్పించి అకౌంట్లు ఓపెన్ చేయించాలన్నారు. అప్పుడే కూలీలకు సంబంధించిన నగదు నేరుగా కాకుండా బ్యాంకులో జమచేయనున్నట్లు తెలిపారు. రెండవ విడత రైతు రుణమాఫీ కార్యక్రమం సమర్థవంతంగా అమలుచేయుటలో వ్యవసాయాధికారుల సమన్వయంతో బ్యాంకు అధికారులు ఎలాంటి సమస్యలు లేకుండా అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో అమలుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పిడి హరిత, వ్యవసాయ శాఖ జెడి హేమమహేశ్వరరావు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జి వెంకటరావు, నాబార్డు ఎజిఎం బి రమేష్‌బాబు, ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజర్ కెవిఎస్ మూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.