శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మాదకద్రవ్యాల నిరోధక ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, జూన్ 26: మాదక ద్రవ్యాల నిరోధంలో యువత ప్రధాన భూమిక పోషించాలని కలెక్టర్ ఎం జానకి అన్నారు. జిల్లా కేంద్రంలోని విఆర్‌సి కూడలి వద్ద ఆదివారం ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయంగా నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించి యువత అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిషిద్ధ డ్రగ్స్‌ను వినియోగించటం వలన వివిధ రకాల శ్వాసకోశ, గుండె, కాన్సర్ కారక వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఔషధాల వినియోగంలోను అప్రమత్తత అవసరమన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినయోగం వలన వచ్చే దుష్పలితాలను వివరించేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఔషద నియంత్రణాధికారి డాక్టర్ సివి సురేష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సివిఎస్ భాస్కర్, ఎన్ ప్రభాకర్, సివి నాగరాజు, షాహుల్, శ్రీనివాసులు పాల్గొన్నారు.