శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మా వెంటే ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 7: పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నా ఇంకా చంద్రబాబు ‘ఆకర్ష్’లతో ఇతర పార్టీల నేతలకు ఎందుకు గాలం వేస్తున్నారో అర్థం కావడం లేదని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం నెల్లూరులోని తన కార్యాలయంలో ఆంధ్రభూమి ప్రతినిధితో ఎంపి మేకపాటి మాట్లాడుతూ ఆదరించి టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకున్న పార్టీకి నమ్మకద్రోహం చేస్తున్న వారితో పార్టీకి వచ్చిన ఇబ్బంది పెద్దగా ఏమీ లేదన్నారు. నేడు అధికారపక్ష ప్రలోభాలకు లొంగి పార్టీ మారుతున్న వారికి అక్కడ ప్రాధాన్యత ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇటు ప్రజల మద్దతు కూడా వారు కోల్పోతారని దుయ్యబట్టారు. ఇటువంటి చర్యల వల్ల తమ పార్టీని నిర్వీర్యం చేయాలని భావిస్తే అంతకన్నా హాస్యాస్పద విషయం మరోటి ఉండబోదన్నారు. ప్రజల్లో తమకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోందన్నారు. నేతలు మారినా ప్రజల మద్దతు ఎప్పటికీ వైకాపాకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో సమర్ధులైన వారిని ఎంపికచేసి వారికి టిక్కెట్లిచ్చేలా తమ నేత జగన్మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాగునీటికి ప్రాధాన్యత
గత రెండేళ్లుగా తన ఎంపి కోటా నిధులతో జిల్లాలో మెట్ట ప్రాంతాలకు, ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఎంపి మేకపాటి తెలియచేశారు. మెట్ట ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ దాహార్తిని తీర్చుకునేందుకు మైళ్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. అదేవిధంగా తాను దత్తత తీసుకున్న కంపసముద్రం గ్రామంలో కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. కొన్ని పనులు పూర్తయ్యే దశలోనూ, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభ దశలో ఉన్నట్లు తెలిపారు. కావలివాసులు ఎప్పట్నుంచో కోరుకుంటున్నట్లు కాకినాడ-బెంగళూరు నడుమ తిరిగే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌కు కావలిలో స్టాపింగ్ ఏర్పాటు చేయించామన్నారు. సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళల మార్పుపై తాను ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లానని, దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. నడికుడి-కాళహస్తి రైలుమార్గం ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం భూసేకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ రైలు మార్గం ఏర్పాటైతే మెట్ట ప్రాంతవాసులకు మేలైన ప్రయాణ సౌకర్యం కలుగుతుందన్నారు. నెల్లూరులోని కేంద్రీయ విద్యాలయం కొత్త భవనాలను మరో వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంపి కోటా నిధులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం రూపొందించే పలు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతోందని అన్నారు. స్వచ్ఛ్భారత్ వంటి నినాదాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలంటే నిధులు వెచ్చించక తప్పనిసరి అని ఆయన అన్నారు.