శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విద్యాసంస్థల బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, జూలై 15: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని, రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా విద్యార్థి జెఎసి జిల్లా కన్వీనర్ డి.అంజయ్య ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ఉదయం 8గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలను మూయించివేశారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఉన్న ప్రధాన కూడళ్లలో రాస్తారోకోలు నిర్వహించారు. 15వ తేదీన విద్యా సంస్థలు బంద్ నిర్వహిస్తామని ముందుగానే చెప్పడంతో పలు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేశారు. పలువురు పాఠశాలలు నిర్వహిస్తుండటంతో విద్యార్థి సంఘాల నాయలకు మూయించివేశారు. నగరంలోని డికెడబ్ల్యూ కళాశాల నిర్వహిస్తుండగా విద్యార్థులు అక్కడికి చేరుకొని విద్యార్థినులను బయటకు పంపివేశారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దానిని విస్మరించిందన్నారు. ప్రత్యేకహోదా ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీకి తెలిసినా చంద్రబాబు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జతకట్టినప్పటికీ ప్రత్యేకహోదా సాధించుకోలేకపోవడం దురదృష్టకరమన్నారు. అటు రాష్ట్రం, ఇటు విద్యా రంగం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాల్సిందేనన్నారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాలన్నీ ఏకమై తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డక్కా చిరంజీవి, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు ఎం.సునీల్, పవన్, నరసింహ, రవి, గుణ, హరీష్ పాల్గొన్నారు.