శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

డాక్టర్ శాంతకు ఎల్లాప్రగడ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 7: నెల్లూరులోని డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఫౌండేషన్ ప్రతియేటా అందించే ప్రతిష్ఠాత్మక ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డును ఈ ఏడాది ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణురాలు, మద్రాస్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ శాంతకు అందించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ శాస్తవ్రేత్త డాక్టర్ ఎ.జగదీష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17న వెంకటాచలంలోని స్వర్ణ్భారత్ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఆమెకు అవార్డును అందివ్వనున్నట్లు తెలిపారు. గత 60 ఏళ్లుగా క్యాన్సర్ ఇన్స్‌స్టిట్యూట్‌లో వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ శాంత గతంలో రామన్ మెగాసెసే అవార్డుతో పాటు భారత ప్రభుత్వ రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందారని కొనియాడారు. మందుల మాంత్రికుడిగా పేరొందిన ఎల్లాప్రగడ సుబ్బారావు అమెరికా వెళ్లి ఎన్నో ప్రమాదకర వ్యాధులకు మందులను కనుగొన్నారని గుర్తుచేశారు. అంత విశిష్టమైన వ్యక్తి పేరిట ఇస్తున్న అవార్డుకు ఈ ఏడాది శాంత లాంటి సేవాతత్పరత కలిగిన వ్యక్తికి అందివ్వడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి కల్‌రాజ్‌మిశ్రాతో పాటు రాష్ట్ర మంత్రి నారాయణ కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు.