శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రత్యేక హోదా బిల్లు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకోవడం దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, జూలై 22 : కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లును ఓటింగ్‌కు రానివ్వకుండా బిజెపి నాయకులు పోడియం వద్దకు దూసుకురావడం అన్యాయమని పిసిసి ప్రధాన కార్యదర్శి చెంచలబాబుయాదవ్, పిసిసి అధికార ప్రతినిధి రఘురామ్ ముదిరాజ్ తెలిపారు. శుక్రవారం ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా బిల్లును ఓటింగ్‌కు రానివ్వకుండా బిజెపి కుట్ర పన్నుతోందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారం వచ్చిన తరువాత మాట తప్పుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలు మానుకుని ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు సివి శేషారెడ్డి, అనూరాధ తదితరులు పాల్గొన్నారు.