శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మార్చికల్లా పెన్నా, సంగం బ్యారేజి పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు సిటీ, జూలై 24: వచ్చే ఏడాది మార్చికల్లా పెన్నా, సంగం బ్యారేజి నిర్మాణ పనులను పూర్తిచేస్తామని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం నిర్మాణంలో ఉన్న పెన్నా బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని అన్నారు. పెన్నా బ్రిడ్జిపై ప్లేట్ల నిర్మాణ పనులు కొంతవరకు జరిగాయన్నారు. పెన్నా, సంగం బ్యారేజి పనులు వేగంగా పూర్తిచేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రెండుసార్లు ఏరియల్ సర్వే, రెండుసార్లు స్వయంగా వచ్చి నిర్మాణ పనులు పరిశీలించారని తెలిపారు. కాంట్రాక్టర్లు, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. కృష్ణా బ్యారేజిలో నీళ్లు లేకపోతే గోదావరి జలాలను కృష్ణా నీటిలోకి పంపడం జరిగిందన్నారు. పట్టిసీమను కూడా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రైతులకు సాగు, తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాయలసీమ కరవు ప్రాంతాలకు కూడా సాగు, తాగునీరు అందించేందుకు లక్ష్యంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ అబ్దుల్ అజీజ్, శాసనమండలి సభ్యుడు రవిచంద్ర, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.