శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బిడ్డతో సమానంగా మొక్కను పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, జూలై 26: ఆసుపత్రులలో కాన్పు అయిన వారికి ఒక మొక్కను ఇచ్చి బిడ్డతోపాటు ఆ మొక్కను కూడా పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అధికారులను సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పకృతి అనేది చాల ముఖ్యమని, చెట్లు పకృతిని కాపాడుతాయన్నారు. పరిశ్రమల ప్రాంగణాలలో, విద్యాలయ ప్రాంగణాలలో, కార్యాలయ ప్రాంగణంలో, రోడ్ల వెంబడి, రైల్వే ట్రాక్‌ల వెంబడి చెట్లు నాటే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెట్ల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. నాటే ప్రతి చెట్టును జియోలాగింగ్ విధానం వలన అనుసంధానం చేయడం జరుగుతుందని, దీని వలన నాటే ప్రతి చెట్టు వివరాలను తెలసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. వివిధ శాఖలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం వలన అసలైన లబ్ధిదారులకు మేలు కలుగుతుందన్నారు. కృష్ణా పుష్కరాల జరిగే రోజులలో రోజుకి ఒక్కొక్క రోజు ఒక ప్రభుత్వ ప్రాధన్యత గల అంశాలను గ్రామస్థాయిలోకి తీసుకుపోవాలన్నారు. ప్రజాసాధికార సర్వేలపై ఆయన అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, డిఆర్‌ఓ మార్కండేయులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.