శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, జూలై 29: ఆంధ్రప్రదేశ్‌ను ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక పురమందిరంలో శుక్రవారం జరిగిన యాంటి ర్యాగింగ్ సదస్సును ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిఎన్‌ఎస్‌ఎఫ్ యాంటీ ర్యాగింగ్‌కు కీలక పాత్ర పోషించాలన్నారు. మంత్రిని కాకముందు నారాయణ విద్యా సంస్థల్లో నేను ఎల్‌కెజి నుంచి పిజి వరకు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ర్యాగింగ్ బాధితులు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టేందుకు ముందుకు రావడం లేదన్నారు. కళాశాలలో చేరిన జూనియర్ విద్యార్థుల్లో భయం పోగొట్టి స్నేహభావం పెంపొందించేందుకు మొదలైన ర్యాగింగ్ ప్రక్రియ క్రమంగా వికృత రూపం దాల్చి తీవ్రపరిణామాలకు దారితీస్తుందన్నారు. 1998లో దివ్య జాగృతి మిషన్ ర్యాగింగ్‌ను అరికట్టాలని సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేయగా 2001లో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ సుప్రీం కోర్టు సూచనలు చేసిందన్నారు. ర్యాగింగ్ నిషేధిత చట్టం 2009గా అమల్లోకి వచ్చిందని, నేషనల్ యాంటి హెల్ప్‌లైన్ గణాంకాల ప్రకారం 2009 నుంచినేటి వరకు దేశ వ్యాప్తంగా 3,542 కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్‌లో 94 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రతి వంద మందిలో 40మంది ర్యాగింగ్ బారిన పడుతున్నారని, ప్రతి ఒక్కరూ ర్యాగింగ్‌పై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. ర్యాగింగ్ చేసిన వారికి పలు సెక్షన్ల ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులను చైతన్య పరిచే విధంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాల్సిన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న అవగాహన సదస్సులు, యాంటీ ర్యాగింగ్ గోడప్రతులు, కరపత్రాలు పంపిణీతో విద్యార్థులను చైతన్యపరచి ర్యాగింగ్ భూతాన్ని తరిమివేయాలన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ర్యాగింగేనని, సరదాగా ప్రారంభం అవుతున్న ర్యాగింగ్ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుందన్నారు. ర్యాగింగ్‌ను రూపుమాపేవిధంగా విద్యార్థులు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు విద్యా సంస్థల కంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే అధికంగా ర్యాగింగ్ జరుగుతుందన్నారు. ర్యాగింగ్ నిరోధానికి హెల్ప్‌లైన్ నెంబరు 18001805522కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థుల వద్ద ర్యాగింగ్ చేయనని, చేయనివ్వమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, డిఎస్పీ వెంకటరాముడు, ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలనాయుడు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డి, బుచ్చి భువనేశ్వరప్రసాద్, చాట్ల నరసింహారావు పాల్గొన్నారు.