శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విశ్రాంత ఎస్‌ఐ ఇంట్లో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, జూలై 31 : వెంకటాచలం రైల్వేగేటు వద్ద గత కొనే్నళ్ల నుంచి నివాసముంటున్న విశ్రాంత ఎస్‌ఐ షేక్ ఖాసీం ఇంట్లో చోరీ జరిగిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 18 సవర్ల బంగారంతో పాటు మొత్తం 5 లక్షలు విలువ చేసే వస్తువులు అపహరించుకుని వెళ్లారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇంట్లో ఖాసీం భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. ఆయన భార్య ఇటీవల విశాఖపట్నంకు వెళ్లగా ఆయన ఒక్కడే ఇంట్లో ఉంటున్నారు. ఆయన గత రెండురోజుల క్రితం నెల్లూరుకు వెళ్లారు. తిరిగి ఆదివారం ఇంటికి వచ్చేసరికే ఇంటి తాళాలు పగలకొట్టి ఉంది. అనుమానం వచ్చిన ఆయన లోపలికి వెళ్లి చూడగా ఇంట్లోని బీరువాలు, లాకర్లు పగులకొట్టి చోరీ చేసినట్లు గుర్తించారు. దీంతో వెంకటాచలం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెంకటాచలం ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, పిఎస్‌ఐ ఆంజనేయులు చేరుకుని పరిశిలించారు. బీరువాలో దాచిన 18 సవర్ల బంగారం, అరకిలో వెండి వస్తువులు, లక్ష రూపాయలు విలువ చేసే రెండు కెమేరాలు, మూడు విదేశీ గడియారాలు, 50 వేలు విలువ చేసే చీరలు, ల్యాప్‌టాప్ తదితర వస్తువులు చోరీకి గురైనట్లు ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకటాచలం పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్‌ని పిలిపించగా వారు వేలిముద్రలు సేకరించారు. నిందితులు చోరీకి వాడిన రెండు రాడ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం నెల్లూరు రూరల్ సిఐ శ్రీనివాసులురెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.