శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పుర పాలనలో అవినీతి కంపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 31: ఇంటి నిర్మాణం చేపట్టాలన్నా.. క్రమబద్ధీకరించుకోవాలన్నా.. పన్ను మార్పు చేయాలన్నా.. కారుణ్య నియామకం పదోన్నతులు.. కొళాయి కనెక్షన్‌లు పొందాలన్నా. ఇలా ఏ పుర సేవలకైనా ఎంతోకొంత ముట్టచెప్పుకోవాల్సిందే. చివరకు వీధుల్లో చెత్తతీయాల్సి వచ్చినా కొంత నగదు చెల్లించుకోవాలి. లేకుండా పని జరగదు సరికదా.. సంబంధిత పనికి సంబంధించిన దస్త్రం ఎక్కడ ఉందో కనిపించకుండా మాయమైపోతుంది. ఇది నెల్లూరు జిల్లాలో నగర, పురపాలక శాఖల్లోని పలు విభాగాల్లో గత కొనే్నళ్లుగా వేళ్లూనుకుపోయిన అవినీతి. ఓవైపు అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు చేసి ఏటా సిబ్బందిని అరెస్ట్‌లు చేస్తున్నా వేలాది రూపాయలు వేతనం తీసుకుంటున్న అధికారుల పనితీరులో మార్పురావడం లేదని చెప్పవచ్చు. ఇటీవల నెల్లూరు నగర కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ అధికారిపై ఏసిబి దాడులు చేసినా వారిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. జిల్లాలోని పలు పురపాలక సంఘాలలో చిన్నపాటి పని చేయించుకోవాలంటే జేబు ఖాళీ చేయాల్సి వస్తోందని కొందరు ఉద్యోగ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై పలువురు బాధితులు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పురపాలక శాఖలో పలు విభాగాల తీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు నగరంలోని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ టౌన్ ప్లానింగ్ అధికారులందరినీ సస్పెండ్ చేస్తామనడం చూస్తుంటే ఉద్యోగులు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో అర్థమవుతోంది. నగర, పురపాలక శాఖల్లో అవినీతిమయ ఉద్యోగాల్లో పట్టణ ప్రణాళిక మొదటి స్థానంలో ఉంటుందని గతంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు బాహాటంగానే విమర్శ చేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంటి నిర్మాణ ప్రణాళిక సమయంలో రూ.10వేల వరకు ఇచ్చుకోవాల్సి ఉండగా పైఅధికారుల సంతకానికి రూ.వెయ్యి నుంచి 1,500ల వరకు ఆమోదముద్ర పడాలంటే మరికొంత చెల్లించుకోవాల్సిందే. ఇంటి నిర్మాణం పూర్తయ్యేసరికి రెండంతస్తుల భవనానికి రూ.40 వేల పైబడి సమర్పించుకోవాల్సిందే. జిల్లా వ్యాప్తంగా నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు అన్ని పురపాలక సంఘాల్లో సుమారు 1500 మందికిపైగా పారుశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారు. చెత్త తరలింపు విషయంలో వాహనాలకు ఇంధన ఖర్చులే కాకుండా కొనుగోలు చేస్తున్న చీపుళ్ల వరకు అవినీతి బహిర్గతం అవుతోంది. పట్టణాల్లో ఇంటి నిర్మాణానికి ఎంత కష్టపడాలో అంతకు రెట్టింపు పన్ను విధింపు సమయంలో నరకాన్ని చవిచూడాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో కొన్నింటికి పన్ను వసూలు చేస్తూ మరికొన్నింటికి తప్పిస్తూ పురపాలక శాఖకు రూ.లక్షల ఆదాయాన్ని గండి కొడుతున్నారు. రెవెన్యూ ఉద్యోగ సిబ్బంది చేతివాటం కనిపిస్తోంది. చదరపు అడుగుకు పురపాలక శాఖ నిబంధనల మేరకు పన్ను విధించాల్సి ఉంది. అంటే ఒక ఇంటికి రూ.6 వేల వరకు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉన్నా ఆ విధింపు సమయంలో పన్నుకు మూడొంతులు సమర్పించుకోవాలి. ఏటా పట్టణాల్లో సుమారు వందల కోట్ల రూపాయలు అభివృద్థి పనులకు టెండర్లు పిలుస్తున్నా ఇంజనీర్ విభాగంలో పూర్తిస్థాయి అధికార సిబ్బంది ఉన్నా దస్త్రాలు కదలవు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పని ప్రారంభించాలని లేకుండా గడువు సమయం దాటిపోతుందని కొందరు గుత్తేదారులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపాలిటీలలో అవినీతి రాజ్యమేలుతున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవినీతిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. విధి నిర్వహణలో ప్రతి ఉద్యోగి పూర్తి నిబద్ధత పాటించాలి. ప్రభుత్వం అందిస్తున్న వేతనాలు పొందతూ అవినీతికి కొందరు పాల్పడడం వల్ల ఈ ప్రభావం అందరిపై పడుతోంది.