శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పథకాల అమలులో జిల్లాను ప్రథమస్థానంలో నిలబెడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, ఆగస్టు 5: ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను ప్రథమస్థానంలో నిలబెడదామని అధికారులకు కలెక్టర్ రేవు ముత్యాలరాజు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశహాలులో శుక్రవారం ఆయన ఉపాధిహామీ, పంట సంజీవని, సిసి రోడ్లు, పంట, ఇంకుడు గుంటలు, శ్మశానవాటికలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం ద్వారా అవసరమైన పనులను జనరేట్ చేసి కూలీలకు పనులు కల్పించి పేమెంట్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు ఆయా మండలాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనుపరచాలన్నారు. పంట, ఇంకుడుగుంటల పనులకు సంబంధించి చాల వెనుకబడి ఉన్నామని, లక్ష్యాల ప్రగతి కోసం సమీక్షించుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు సంబంధించిన ఖాతా సంఖ్యలకు వారి ఆధార్ సంఖ్యను అనుసంధానించి ఖాతాలో జమ చేయాలన్నారు. పంచాయతీరాజ్‌శాఖ సిసిరోడ్లు పనులను పూర్తి చేయుటలో ఇంజనీరింగ్ అధికారులు పురోగతి సాధించాలన్నారు. వర్మికంపోస్ట్, శ్మశానవాటికలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలకు విడుదల చేసిన నిధులకు అనుగుణంగా అవసరమైన ప్రతిపాదనలు పంపి మంజూరుతో పాటు నిర్దేశించిన పనులు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి పనుల తీర్మానాలను ఆమోదించాలన్నారు. నిర్దేశించిన పనులలో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. మండల అధికారులు వారి పరిధిలోని పనులను వారానికి ఒకసారి పరిశీలించి తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహించి లక్ష్యాలను సాధించాలన్నారు. లక్ష్యాల ప్రగతిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డ్వామా పిడి హరిత, జడ్పి సిఇఒ బి రామిరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఇ బుగ్గయ్య, కార్యనిర్వాహక ఇంజనీర్లు, వివిధ మండలాలకు చెందిన ఎంపిడిఒలు, సహాయక ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.