శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మొక్కలే ప్రాణాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు6: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వనం-మనం కార్యక్రమం కింద నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో శనివారం విస్తృతంగా మొక్కలు నాటారు. స్థానిక బాలాజీనగర్ స్టేషన్ పరిధిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు మాట్లాడుతూ మొక్కలే మనకు ప్రాణాధారమని, వాటిని విస్మరించడం వల్లనే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థులకు మొక్కల పెంపక ఆవశ్యకతను తెలియచేయాల్సిన బాధ్యత గురువులతో పాటు తల్లిదండ్రులపై ఉందన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 5 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, ఇప్పటికే 90 శాతం మొక్కలు నాటడం పూర్తయిందని తెలిపారు. బాలాజీనగర్ సిఐ చెంచురామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు విద్యార్థులతో కలిసి స్థానిక పూలే విగ్రహం నుంచి ఎస్‌విజిఎస్ కళాశాల వరకూ ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బాలాజీనగర్ స్టేషన్ ఎస్సైలు వెంకట్రావు, సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
1వ స్టేషన్ పరిధిలో..
ఒకటవ నగర స్టేషన్ పరిధిలోని కోటమిట్ట ఉర్దూ స్కూల్ ప్రాంగణంలోనూ, ప్రధాన వీధుల వెంబడి సిఐ అబ్దుల్‌కరీం, ఎస్సై గిరిబాబుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విద్యార్థుల్లో మొక్కల పెంపక ఆవశ్యకతను చిన్ననాటి నుంచే తెలిసేలా చూడడం తల్లిదండ్రుల బాధ్యతగా పేర్కొన్నారు.

తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదు
* ఆశ్రమ ఇవో బాలసుబ్రహ్మణ్యం వెల్లడి
వెంకటాచలం, ఆగస్టు 6: గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమ సిబ్బందిపై దాడి చేయడంతోనే కేసు పెట్టామని, తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం తనకు లేదని గొలగమూడి ఆశ్రమ ఎగ్జిక్యూటివ్ అధికారి పి బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. మండలంలోని గొలగమూడి ఆశ్రమ కార్యాలయంలో శనివారం ఆశ్రమ కమిటీ సభ్యులు, ఉయకర్తలు, గ్రామస్థులతో కలిసి ఆయన విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత నెల 10వ తేదిన వెంకయ్యస్వామి ఆశ్రమాన్ని సుమారు 50 మంది వరకు దర్శించుకున్నారని, అయితే ఆశ్రమ సిబ్బంది వారి వద్దకు వెళ్లి ఆశ్రమం లోపల కూర్చోవద్దని, భజన మందిరంలోకి వెళ్లమని చెప్పిన సిబ్బందిపై ఇద్దరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించటంతోపాటు ఆశ్రమ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ సంఘటన దృశ్యాలు సిసి కెమేరాల్లో రికార్డు అయ్యాయన్నారు. ఆ వ్యక్తులతో తమకు ఎలాంటి విభేదాల్లేవని అన్నారు. బయట వ్యక్తుల ప్రోద్భలంతోనే వారు దురుసుగా ప్రవర్తించి ముందస్తు ప్రణాళికతోనే దాడికి పాల్పడ్డారని వివరించారు. నిజానిజాలు పోలీసుల విచారణలో తేలుతాయన్నారు. రెండేళ్లుగా సాధన పదయాత్ర చేస్తుంటే తాము ఎప్పుడూ అడ్డుకోలేదన్నారు. ఆశ్రమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ఆశ్రమానికి ఇబ్బందికర పరిస్థితిలు వస్తాయన్న కారణంతో పదయాత్ర నిర్వాహకులు అల్లు భాస్కర్‌రెడ్డికి సత్సంగాలు నిలిపివేయమని ముందస్తుగా చెప్పామన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని దాడికి పాల్పడ్డారన్నారు. తాము తప్పుడు కేసులు పెట్టామని భాస్కర్‌రెడ్డి పత్రికల వారికి చెప్పడం దారుణమన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు సూళ్లూరుపేట సాయినగర్‌లోని సాయి మందిరంలో చోటుచేసుకున్నాయని, ఈ కేసులో అల్లూ భాస్కర్‌రెడ్డి కుమారుడితోపాటు మరో నలుగురిపై కేసులు నమోదు కావడంతో వారికి శిక్ష కూడా పడినట్లు ఆయన వివరించారు. గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం కోర్టు ఆధీనంలో నడుస్తోందని, ఎంతటివారైనా ఆశ్రమ కమిటీ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఆశ్రమ నిబంధనలు అతిక్రమించి కార్యక్రమాలు చేపడుతుంటే అనుమతించేది లేదని ఆయన తేల్చి చేప్పారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు, ఉభయకర్తలు ఈదూరు రామ్‌మోహన్‌రెడ్డి, బి శ్రీనివాసులురెడ్డి, మోచర్ల మధు, అదినారాయణరెడ్డి, నాగార్జున నాయుడు, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

క్రిభ్‌కో నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు
వెంకటాచలం, ఆగస్టు 6: మండలంలోని సర్వేపల్లి పంచాయతీ పరిథిలో క్రిభ్‌కో పరిశ్రమకు ఎపిఐఐసి ద్వారా ప్రభుత్వం కేటాయించిన భూములలో శనివారం ప్రహరీ నిర్మాణం చేపడుతుండగా స్థానిక ముత్యాలగుంట గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన 100 మందికి 1983లో ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందన్నారు. దీంతోపాటు 2004లో తమ గ్రామానికి ప్రభుత్వం మోడల్ కాలనీ కింద ఎంపిక చేసి 4 ఎకరాల స్థలంలో ప్లాట్లు వేసి తమకు ఇచ్చిందన్నారు. అయితే తమ స్థలాలను క్రిభ్‌కో పరిశ్రమకు కేటాయించారని, తమకు ఎలాంటి పరిహారం, ప్రత్యామ్నాయం చూపించకుండానే తమ ఇళ్లు కూల్చిస్తామని చెప్పడం దారుణమన్నారు. దీంతో తాము క్రిభ్‌కో ప్రహరీ నిర్మాణం అడ్డుకున్నామని వారు ఆర్డీవోకు చెప్పారు. దీనిపై స్పందించిన ఆర్డీవో క్రిభ్‌కో ప్రహరిగోడ నిర్మాణానికి అడ్డువచ్చే ఇళ్ల జోలికి వెళ్లకుండా ప్రస్తుతానికి అక్కడ ప్రహరీ నిర్మాణం ఆపాలన్నారు. ఈ విషయాన్ని తాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట వెంకటాచలం ఇన్‌చార్జ్ తహశీల్దార్, ముత్తుకూరు తహశీల్దార్ చెన్నయ్య, వెంకటాచలం ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.