శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అయ్యో పాపం గర్భవతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, ఆగస్టు 9: ఇటీవల స్థానిక పిహెచ్‌సిని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందిలో పరివర్తన రాకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా వారిలో మార్పు లేదనడానికి ఇదే ఉదాహరణ. మంగళవారం స్థానిక పిహెచ్‌సిలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమానికి వచ్చిన గర్భిణులు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి నెల 9వ తేదిన పిహెచ్‌సికి వచ్చే గర్భిణులకు మంచినీళ్లు, ప్లేట్లు, షామియానా, కుర్చీలు తదితర వసతులను ఏర్పాటు చేయాలి. ఐసిడిఎస్ మధ్యాహ్న భోజనం కల్పించాలని జిల్లా అధికారులు ముందుగానే సూచించారు. మండలం నుండి సుమారు 130 మందికి పైగా గర్భిణులు స్థానిక పిహెచ్‌సికి వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. వీరితోపాటు వీరికి సహాయంగా వచ్చినవారితో పిహెచ్‌సి కిటకిటలాడింది. అయితే వారు కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. ఓ చిన్న షామియాను మాత్రమే వేసి చేతులు దులుపుకున్నారు. పిహెచ్‌సికి వచ్చిన సిడిపిఓ శారద దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా తాము గర్భిణులకు ఆహారం మాత్రమే ఏర్పాటు చేశామని, కుర్చీలు, షామియానాలు, తాగునీరు వంటి వసతులను ఆసుపత్రి అధికారులు చేస్తారని జిల్లా కలెక్టరు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. అనంతరం ఆమె పిహెచ్‌సికి డిఎంహెచ్‌ఓ వస్తున్నారని, సిహెచ్‌ఓ ఆదినారాయణ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించడంతో హడావుడిగా కుర్చీలను వేశారు.