శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఇద్దరు దొంగలు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 9: ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తును 4వ నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో 4వ నగర సిఐ సిహెచ్.సీతారామయ్య వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. నగరంలోని జ్యోతినగర్‌కు చెందిన చిలమకూర్తి సతీష్, బాలాజీనగర్‌కు చెందిన కాలి రాజ్‌కుమార్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వృత్తిరీత్యా స్నేహితులైన వీరిద్దరు తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తుంటారు. ఈక్రమంలో నాల్గవ పట్టణ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనాలకు సంబంధించి సిఐ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుళ్లు ఆర్.సురేష్‌కుమార్, ఆర్.పోలయ్య, కానిస్టేబుళ్లు శివకృష్ణ, మహేందర్‌రెడ్డి, వేణు, రాజేంద్ర, పోలయ్య, శ్రీకాంత్‌లు బృందంగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం స్థానిక రామలింగాపురం లారీ స్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు వారు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు, ల్యాప్‌టాప్, 15 కిలోల రాగి వైరును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తు విలువ లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.