శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు సవరణను తప్పుదోవ పట్టించడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు సిటీ, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అనుమతించ లేదని అరుణ్‌జైట్లీ చెప్పడం సవరణను తప్పుదోవ పట్టించడమేనని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి విమర్శించారు. నిజానికి 14వ ఆర్థిక సంఘం ఎక్కడా కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పలేదని ఆధారాలతో సహా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జయరామ్ రమేష్ చెప్పారని తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం మొదలు పెట్టినరోజు సందర్భంగా మంగళవారం నెల్లూరులోని ఇందిరాభవన్‌లో సేవాదళ్ ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణలో వందనం స్వీకరించి ర్యాలీగా మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎపిసిసి నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్ బి చెంగల్‌రాయుడు, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని మాజీ ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అన్నారు. ఇచ్చిన హామీ చట్టంతో సమానమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను 10 సంవత్సరాలు అమలు చేస్తామని ఎన్నికల్లో బిజెపి హామీ ఇచ్చారని, చంద్రబాబునాయుడు 15 సంవత్సరాలు అమలు చేయాలని కోరారని ఇప్పుడు ఇద్దరు భాగస్వాములై ప్రభుత్వం ఏర్పడిన తరువాత హోదాపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం దారుణమన్నారు. డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత రెండు వంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కు కోసం శ్రీకారం చుట్టిందన్నారు. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టిన బిజెపి, టిడిపిలు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఈనెల 5వ తేదీన రాజ్యసభలో స్వయంగా మాట్లాడి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారన్నారు. వాటిని అమలు చేయకపోవడం బిజెపి, టిడిపి అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమన్నారు. ఏపిసిసి నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్ చెంగల్‌రాయుడు మాట్లాడుతూ ఏపికి ప్రత్యేక హోదా అమలు చేయకుండా ఎన్డీఎ సాకులు వెతుకుతోందని పలు పార్టీలు తప్పుబట్టాయని అన్నారు. రాజ్యసనలో ఉప సభాపతి కురియన్ కెవిపి బిల్లును లోక్‌సభ నిర్ణయానికి పంపుతున్నామని ప్రకటించగానే బిజెపి మంత్రులు, టిడిపికి చెందిన కేంద్ర మంత్రులు చప్పట్లు కొట్టి బల్లలు చరచడం ఎంతో విద్రోహమో తేటతెల్లమవుతోందన్నారు. బిజెపి, టిడిపి వారు ఎన్నికల హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, రెండు పార్టీలు కుమ్మక్కై దేశ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు సివి శేషారెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి, చెంచలబాబు యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా అమలు చేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటలు కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ స్టేట్ కో ఆర్డినేటర్ షేక్ ఆసిఫ్ పాషా, బిసి సెల్ రాష్ట్ర కన్వీనర్ గాలాజు శివాచారి, తిరుపయ్య, బెజవాడ గోవిందరెడ్డి, ఎల్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.