శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అగ్రదేశాల వ్యాపారాల కోసమే అణు కర్మాగారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, ఆగస్టు 11: అగ్రదేశాల వ్యాపార కాంక్ష, ఎలాగైనా ఇతర దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో అవి పాలకులను మైమరపించి అణు విద్యుత్ ప్లాంట్‌ల నిర్మాణానికి ఎర వేస్తున్నాయని, ఇందులో భాగంగానే కావలి ప్రాంతంలో అణు ప్లాంట్ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజాసంఘాలు ఆరోపించాయి. గురువారం స్థానిక కారోనేషన్ రీడింగ్ రూం ఆవరణంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లాకార్యదర్శి గొట్టిపాటి సునీత, జిల్లా సహాయ కార్యదర్శి వివి రమణయ్య, నవయుగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎల్ లక్ష్మీరెడ్డి తదితరులు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యున్నత సాంకేతికత ఉండి స్వీయ పరిజ్ఞానంగల అగ్రదేశాలలోనే అణు ప్రమాదాలు జరిగిన తీరును వివరించారు. దేశమంతా అణు విద్యుత్ ప్లాంట్‌ల నిర్మాణం జరిగితే శత్రు దేశాలు, టెర్రరిస్టులు దాడులకు తెగబడితే రక్షించేవారెవరని నిలదీశారు. ఈ క్రమంలోనే అగ్రదేశాలు 2050 నాటికి అణు విద్యుత్ కేంద్రాలను పూర్తిగా మూసివేసే దిశగా నిర్ణయాలు తీసుకుని ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు అడుగులు వేస్తున్నాయన్నారు. అయితే మన దేశంలో పాలకులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ చాలినంత విద్యుత్ ఉన్నా అణు ప్లాంట్‌ల వైపు చూస్తున్నారని ఆరోపించారు. కావలి ప్రాంతంలో ఏకంగా 6.5 మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లు, ఇందుకు రహస్యంగా సర్వే కూడా నిర్వహించినట్లు చెబుతున్నారని, దీనికి ఎంత మాత్రం ఒప్పుకునేది లేదన్నారు. క్షణాల్లో బూడిద కుప్పలు మిగిల్చే విద్యుత్ తమకు వద్దని, పిల్లా పీచు, చిన్నా పెద్దా అంతా ఒక్కటై ప్రాణాలను ఫణంగా పెట్టి అయినా అడ్డుకుందామంటూ పిలుపునిచ్చారు. ఇటీవల తమిళనాడు, బెంగాల్, ఒరిస్సా, గుజరాత్ వంటి అనేక రాష్ట్రాలలో ఉద్యమాల ఫలితంగా నిర్మాణాలు మానుకుని వెనుదిరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.