శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఆగస్టు 12: ప్రభుత్వ విద్య పరిరక్షణ, విద్యార్థుల సమస్యల పరిష్కారమే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ధేయమని ఆ సమాఖ్య జిల్లా అధ్యక్షులు యాదాల సునీల్ స్పష్టం చేశారు. శుక్రవారం గూడూరులోని ఆ సమాఖ్య 81వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత రెండో పట్టణంలోని ఎస్‌కెఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్య పరిరక్షణ, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం 1936 ఆగస్టు 12న ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో బెనారస్ యూనివర్శిటీలో ప్రేమ్ నారాయణ్ భార్గవ్, బబ్రుద్దీన్ అనే విద్యార్థుల చేత ఈ యూనియన్ ఆవిర్భవించిందన్నారు. నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడే ఏకైక సంఘం ఎఐఎస్‌ఎఫ్ అని చెప్పారు. స్వాతంత్ర ఉద్యమంలోను స్వాతంత్రం మా జన్మహక్కు అనే నినాదంతో భాగస్వాములైన చరిత్ర ఉందన్నారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే నినాదంతో ఉక్కు కర్మాగారాన్ని చెన్నైకి తరలించకుండా అడ్డుకుందన్నారు. ఈ పోరాటంలో 32మంది విద్యార్థులు వీరమరణం పొందారని గుర్తు చేశారు. అనేక విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్యను వ్యాపారీకరణ చేస్తున్నదన్నారు. ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేయడంలో భాగంగా రేషనలైజేషన్, వసతి గృహాలు తొలగిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ పిల్లలు విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు పి సుమంత్, పట్టణ కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు, నాయకులు చిన్న, ముత్తుస్వామి, వెంకటేష్, కిరణ్, సురేష్, ప్రభు, సాయి, శంకర్‌లు పాల్గొన్నారు.