శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నరసింహస్వామి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఆగస్టు 12: నెల్లూరు రూరల్ పరిధిలోని నరసింహకొండ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆలయ పాలకమండలి నూతన చైర్మన్ మల్లినేని వెంకటేశ్వరనాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నరసింహస్వామి ఆలయాన్ని జిల్లాలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానన్నారు. శనివారం స్వామివారి సమక్షంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆయన తెలిపారు. మొదటగా కొండపై మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం వసతులు కల్పిస్తానని ఆయన పేర్కొన్నారు. కొండ కింద ప్రాంతంలో ఉన్న ఏడు కోనేర్లకు గొప్ప చరిత్ర ఉందని, వాటి గొప్పతనాన్ని అందరికీ తెలియజేయవలసిన బాధ్యత తనపై ఉందన్నారు. కొండ చుట్టపక్కల గ్రామాలకు దేవస్థానం నుంచి రోడ్డు మార్గాలు ఏర్పాటు చేస్తానని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా కొండపైన భక్తుల కోసం అన్నదానం, తాగునీరు, వసతి గృహాలు ఏర్పాటు చేస్తానన్నారు. పెద్దస్వాముల సలహాలు, సూచనలు తీసుకుని దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. పాలకమండలి సభ్యుల సహాయ, సహకారాలు, నాయకుల సూచనలు తీసుకుని ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పల్నాటి రాగప్పనాయుడు, గోనేటి వెంకటేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు.