శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నీరు లేకపోతే మానవ మనుగడ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, ఆగస్టు 12: ప్రపంచంలో నీరు అన్నింటికన్నా చాలా ప్రధానమైందని, నీరు లేకపోతే మానవ మనుగడ అసాధ్యమని, అందువల్ల నీటిని అత్యంత పొదుపుగా వాడటంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జెసి 2 సాల్మన్‌రాజ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని పాత జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా పుష్కరాలపై జిల్లా స్థాయి చర్చా వేదిక తొలిరోజు నిర్వహించారు. ఈ చర్చా వేదికలు 12రోజులుపాటు రోజుకు ఒక అంశంపై నిర్వహించాల్సి ఉందని, అందులో భాగంగా నేడు తొలిరోజు జలసంరక్షణ, తాగునీరు, నదుల అనుసంధానంపై చర్చా వేదిక ఆయాశాఖల అధికారులతో నిర్వహిస్తున్నామన్నారు. పరిగెత్తేనీటిని ఆనకట్ట రూపంలో నిలుపుకోవాలని, నిలుపుకున్న నీటిని చెరువులు, రిజర్వాయర్‌ల ద్వారా వినియోగించుకోవాలన్నారు. నీటిని తక్కువగా వాడుకొని ఎక్కువగా నిలుపుదల చేసుకుంటేనే భూగర్భ జలాలు పెరుగుతాయని, ఆదిశగా ఇంజనీర్లు పనిచేయాలన్నారు. ఇరిగేషన్ ఎస్‌ఇ కోటేశ్వరరావు మాట్లాడుతూ రోజురోజుకు భూగర్భజల మట్టాలు ఇంకిపోతున్నాయని, వర్షాలు సకాలంలో కురవడం లేదని, నీటి వినియోగం ఎక్కువగా పెరిగిపోతుందని, దీని వల్ల ఆందోళన చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భావితరాలను దృష్టిలో ఉంచుకొని భూగర్భజల మట్టాలను పెంచేందుకు ఇతర ప్రాంతాల్లో ఉన్న నీటిని తీసుకొచ్చి రిజర్వాయర్‌లో నింపేందుకు ముందుచూపుతో ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. అందులో భాగంగానే కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ప్రారంభమైందన్నారు. డ్వామా పిడి హరిత మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో ఉపాధిహామి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని, ఉపాధిహామి ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఇప్పటికే భారీ ఎత్తున ఇంకుడు గుంతలు, పంట కుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టామని, వీటితోపాటు చెరువులలో పూడికతీత కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారీగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడుతున్నామన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకంలో రైతులకు బోర్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా అడిషనల్ పిడి ప్రభాకర్‌రావు, ఏపిడి వెంకట్రావ్, ఇరిగేషన్ ఇఇలు శ్రీనివాస్‌రావు, వెంకటసుబ్బయ్య, డిఇ రామచంద్రరావు, గ్రౌండ్‌వాటర్ ఏపి శర్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.