శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరులీగల్, ఆగస్టు 16: అప్పు జమకింద చెల్లని చెక్కు ఇచ్చారని దాఖలైన ప్రైవేట్ కేసులో నిందితుడు విడవలూరు కంచెరపాలెం వాసి ఎస్ నాగశీనయ్యపై ఆరోపణలు సాక్ష్యాధారాలతో రుజువైనందున ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తూ నెల్లూరు మొబైల్ మేజిస్ట్రేట్ వైజె పద్మశ్రీ మంగళవారం తీర్పునిచ్చారు. చెక్కు పైకం ఐదు లక్షల పదివేలు నష్టపరిహారంగా ఫిర్యాదికి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరుకు చెందిన ఫిర్యాది ఎవి రాఘవరెడ్డి వద్ద నుంచి నిందితుడు ఎస్ నాగశీనయ్య ఐదులక్షల పదివేల రూపాయలు అప్పుగా తీసుకుని ప్రోనోటు రాసిచ్చాడు. అప్పులోకి జమకింద 2014 ఆగస్టు 21న ఒక బ్యాంకు చెక్కును ఫిర్యాదికి ఇచ్చాడు. ఆ చెక్కును కలెక్షన్ కోసం బ్యాంకులో వేయగా అది చెల్లలేదు. దీంతో ఫిర్యాది నిందితుడిపై ఎన్‌ఐ యాక్ట్ చట్టం ప్రకారం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశాడు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి పైమేర తీర్పు చెప్పారు.