శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పోలీసుల పేరుతో దాడి చేశారంటూ ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఆగస్టు 19: పోలీసులమని చెప్పి ఒక వ్యక్తిని కారులో ఎక్కించుకుని ఆపై దాడి చేసిన సంఘటన వెంకటాచలం మండల పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు... ఇడిమేపల్లి గ్రామానికి చెందిన ఇండ్ల సుబ్రహ్మణ్యం ఇంటికి గురువారం మధ్యాహ్నం నలుగురు వ్యక్తులు వచ్చి తాము నెల్లూరు నగరంలోని పోలీసులమని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తరువాత యానాది కులానికి చెందిన నీ కుమారుడుకి నా కూతురు కావాల్సి వచ్చిందా అంటూ నెల్లూరుకు చెందిన గుండ్లపల్లి మోహన్ తనపై దాడి చేశాడని, అతనితోపాటు ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు కూడా తనను కారులో తిప్పుతూ కొట్టుకుంటూ దాడి చేసి చివరకు రాత్రికి వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద వదిలివేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గుండ్లపల్లి మోహన్ అతని అనుచరులతో తనకు ప్రాణాహాని ఉందని, తనపై కులం పేరుతో దూషించిన నలుగురిని విచారించి ఆపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు సుబ్రహ్మణ్యం పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన వెంట రాష్ట్ర యానాది సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.సి పెంచలయ్య, రాష్ట్ర గిరిజన యువత ప్రధాన కార్యదర్శి హరిబాబు, గిరిజన ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌపూరి సుబ్బారావు, టిడిపి జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డి అదిశేషయ్య, ఎస్టీ నాయకులు కె చంద్ర, వై చంద్రశేఖర్ తదితరులున్నారు.