శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం:సిపిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, ఆగస్టు 21: కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే శరణ్యమని సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎంఎ గపూర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ సిపిఎం కార్యాలయం (రామచంద్రారెడ్డి భవన్)లో ఆదివారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) నిర్వహించిన జిల్లా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలలో సవరణలు చేసి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. వృద్ధాప్యంలో పెన్షన్ జీవనాధారమని దాన్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) పేరుతో పెన్షన్‌దారుల కడుపుకొట్టటం సరికాదన్నారు. కార్మికులకు కనీస వేతన చట్టాలను అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను యాజమాన్యాలకు అనుకూలంగా సవరించడం సరికాదని హితవు పలికారు. కార్మిక చట్టాలను అమలు చేయాల్సిన సంబంధిత కార్మికశాఖ ప్రేక్షకపాత్ర వహించటం దారుణమన్నారు. కార్మిక, కర్షక, ప్రజా సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్ 2న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నారు. యుఇఇయు రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో వాసిరెడ్డి సుధాకర్‌రావు, ఎస్‌కె జాకీర్ హుస్సేన్, ఖాజావలి, పి రామయ్య, పి పెంచలప్రసాద్, పి కృష్ణ, ఎం హనుమంతరావు, గిరిబాబు, జి నాగయ్య, బి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.