శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు టిడిపిలో గ్రూపుల పోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఆగస్టు 21: అధికార తెలుగుదేశం పార్టీకి ఆత్మకూరులో గ్రూపుల పోరు అధికమవుతోంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంలోకి అడుగిడి నెలలు గడుస్తున్నా ఇంతవరకు స్థానికంగా పార్టీపరమైన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో ఆనం, పార్టీ ఇన్‌చార్జి కన్నబాబు వర్గాల పయణం కూడా కలసి సాగడం కరవవుతోంది. అంతేగాక చాలాచోట్ల విభేదాల పరంపర అధికమై ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల స్కూల్ మేనేజిమెంట్ కమిటీ ఎన్నికల్లో భాగంగా ఎఎస్ పేట మండలం చౌటభీమవరంలో అటు ఆనం, ఇటు కన్నబాబు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. గాయాలతో ఆసుపత్రిపాలై పోలీసు కేసులు కూడా నమోదు కావడం తెలిసిందే. తన వర్గానికి చెందిన క్షతగాత్రులను ఇన్‌చార్జి కన్నబాబు పరామర్శించడం కూడా జరిగింది. ఇక పాఠశాల కమిటీలనేవి ఉపాధ్యాయుల ముందు ఉత్సవ విగ్రహాల తంతు మాత్రమే. అయితే ఇదంతా తెలిసి కూడా స్కూల్ ఎన్నికల్లో రక్తగాయాలయ్యేలా కొట్లాట సాగిందంటే కమిటీ ప్రతినిధులు కావాలనేది అసలు సంగతి కాదు. కేవలం ఆనం, కన్నబాబు వర్గాల రాజకీయ ఆధి‘పైత్యం’గానే వ్యవహారం అంత దూరం వెళ్లిందని చెప్పాలి. ఎఎస్‌పేటలో ఆ ఒక్క ఊరిలోనే అలా కొట్లాడుకున్నారు. నియోజకవర్గంలోని చేజర్ల మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఈ రెండు వర్గాల నడుమ కీచులాట జాస్తిగానే ఉండటం గమనార్హం. ఇక నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో పార్టీకి ఎన్ని రకాల గ్రూపులున్నాయో లెక్కించాలంటేనే కష్టతరం. ఆనం వర్గమే కనీసం మూడు గ్రూపులుగా చలామణిలో ఉన్నారు. ఇటీవల ఆత్మకూరు పట్టణంలో చేపట్టిన ఆనం జన్మదిన వేడుకలే ఇందుకు సరైన ఉదాహరణగా ప్రస్తావించుకోవచ్చు. ఆత్మకూరు పట్టణంలో ఈ వేడుకలను పోటాపోటీతో నిర్వహించారు. మాజీ జడ్పీటిసి సభ్యులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్యయాదవ్, యువనేత చల్లా రవికుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆ వేడుకలు వేర్వేరుగా కొనసాగాయి. ఆత్మకూరు పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు వేర్వేరుగానే వెళ్లి అందజేశారు. కేక్ కట్ చేసే వేడుకను సైతం పట్టణంలో పక్కపక్కనే ఉండే సోమశిల, బిఎస్‌ఆర్ కూడళ్ల వద్ద వేర్వేరుగా నిర్వహించడంతో ఆనం వర్గ నేతల సంగతి చర్చలకు తావిచ్చింది. ఇదే వర్గంలో కొనసాగుతున్న మాజీ మార్కెట్ చైర్మన్ ఇందూరు వెంకట రమణారెడ్డి ఈ రెండు గ్రూపులతోనూ కలవక మరో దారిలో వెళ్తున్నారు. అందరూ తెలుగుదేశమే కావడంతో వివిధ సందర్భాల్లో ప్రభుత్వ శాఖల అధికార్లకు ఈ వర్గవైషమ్యాలు విసుగు పుట్టిస్తున్నాయి.