శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఏప్రిల్ 10: గూడూరు 24 సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అహ్మద్ తనిఖీ చేశారు. ఈ కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేశారు, రైతులకు అవసరమైన గోతాలను అందచేశారా లేదా, ధాన్యం నాణ్యత ఎలా ఉంది, రైతులు ఈ కొనుగోలు కేంద్రాల పట్ల ఎలా స్పందిస్తున్నారన్న దానిపై అక్కడి అధికారుల నుండి ఆరా తీశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రైతులు ఎంత ధాన్యం తెచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం కొనుగోలు చేయడం జరుగతుందని, అందువలన రైతులు ఈ ధాన్యం అమ్మకాల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పల్లెల్లో విస్తత్ర ప్రచారం నిర్వహించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకొనే విధంగా చర్యలు తీసుకొనాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసారని, ఇకపై ఎంత వరకు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు.అనంతరం ఆయన గూడూరు తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు సత్వరం అందించే విదంగా రెవిన్యూ అధికారులు పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజల మన్ననలను చూరగొనాలన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు తహశీల్దార్ సత్యవతి,సిబ్బంది ఉన్నారు.