శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

‘రాకేష్ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఆగస్టు 23: చిల్లకూరు గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న రాకేష్ మృతిపై సమగ్ర విచారణ నిర్వహించి, మృతికి కారకులైన వారిని కఠినచర్యలు తీసుకోవాలని మంగళవారం విద్యార్థి తల్లిదండ్రులతో పాటు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ రాకేష్‌ను ఉన్నత విద్యాభ్యాసం చేయించేందుకు గురుకుల పాఠశాలలో చేర్పించామని, ఏమి జరిగిందో గూడూరు సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పదంగా మృతి చెంది ఉండటాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. తమ కుమారుడు మృతిపై సమగ్ర విచారణ నిర్వహించి, ఇందుకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు మందా కృష్ణయ్య మాట్లాడుతూ ఈ విద్యార్థిది ముమ్మాటికీ హత్యేనని, ఇందులో ఎవరి ప్రమేయం ఉందో విచారించి నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం మృతుని కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ వెంకటసుబ్బయ్యను కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మృతుని తల్లిదండ్రులతో పాటు రమణయ్య, రాములయ్య పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.