శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అక్షరలో నేటి నుంచి రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఆగస్టు 25: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటాచలం మండలంలోని సరస్వతినగర్ వద్ద ఉన్న అక్షర విద్యాలయంలో శుక్రవారం నుంచి రాష్టస్థ్రాయి అండర్ 17 బాలబాలికల చెస్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. స్వర్ణ్భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, అక్షర విద్యాలయ కరస్పాండెంట్ దీపా వెంకట్ పర్యవేక్షణతోపాటు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. క్రీడా నిర్వహణ పనులను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటరమణయ్య, అక్షర విద్యాలయ డైరెక్టర్ హరగోపాల్, రాష్ట్ర చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి సుమన్, హరిప్రసాద్‌రావు తదితరులు గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా క్రీడా అధికారి వెంకటరమణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, గెలుపొందిన నలుగురు బాలురు, ముగ్గురు బాలికలు వచ్చే నెల 9వ తేదీన కోల్‌కత్తాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు అక్షర విద్యాలయంలో వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్లు ఆయన వెల్లడించారు. చెస్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 1999 జనవరి 1వ తేదీ తరువాత జన్మించి ఉండాలన్నారు. చెస్ పరికరాలు తమ వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఈ పోటీలను జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.