శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్: పనబాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ పార్టీలో అంచెలంచలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కారకుడై ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య వెల్లడించారు. శుక్రవారం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కరెంటు ఆఫీసు వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు జరుగుతున్న జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సురక్షిత మంచినీటి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని చెప్పారు. ఆయన నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ముందుకు నడాలని కోరారు. పిసిసి సమన్వయ కమిటీ చైర్మన్ సివి శేషారెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిజమైన కాంగ్రెస్ వాది అని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సమర్థవంతంగా రైతు రుణమాఫీ చేశారని, చంద్రబాబునాయుడు లాగా కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయలేదన్నారు. రాజశేఖర్‌రెడ్డికి నిజమైన వారసులు కాంగ్రెస్ కార్యకర్తలన్న విషయాన్ని ఆయన కుమారుడు జగన్ తెలుసుకోవాలన్నారు. జగన్ వైఎస్ ఆస్తులకు వారసుడు తప్ప ఎప్పటికి కూడా రాజకీయ వారసుడు కాలేరన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి చనిపోక ముందు చివరి పిసిసి సమావేశాన్ని హైదరాబాదు ఇందిరాభవన్‌లో నిర్వహించారని, ఆ సమావేశంలో ఆయన రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే తన ముందున్న లక్ష్యమని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆ సమావేశంలో ఉన్న నాయకులందరికీ ఆయన పిలుపునిచ్చారని చెప్పారు. వైఎస్ జగన్ పునరాలోచించుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేయాలని, అప్పుడే రాజశేఖర్‌రెడ్డికి ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శివాచారి, శీలం తిరుపయ్య, ఆసిఫ్, పత్తి సీతారాంబాబు, కేశవ నారాయణ, దామర్ల శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.