శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

శ్రీసిటీని సందర్శించిన కేంద్ర మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, సెప్టెంబర్ 4: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో నెలకొల్పిన శ్రీసిటీ సెజ్‌ను ఆదివారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సందర్శించారు. మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో శ్రీసిటీలోని హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయనకు శ్రీసిటీ సెజ్ డెవలప్‌మెంట్ కమిషనర్ సమాల్, ఎండి రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికారు. అక్కడ నుండి ప్రత్యేక వాహనాల ద్వారా సెజ్ డెవలప్‌మెంట్ కార్యాలయానికి చేరుకొని డిసి కార్యాలయ అధికారులతో చర్చించారు. అనంతరం సిసిఐ ఎవరెస్టు టి, ఇసుజు పరిశ్రమలను సందర్శించి అక్కడ ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిజినెస్ సెంటర్‌కు చేరుకొని శ్రీసిటీ ఎండి ఇతర సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనతికాలంలోనే శ్రీసిటీలో ఏర్పాటు చేసిన వౌలిక వసతులు ఎంతో ఆకట్టుకున్నాయని, ప్రపంచశ్రేణి వస్తువులతో శ్రీసిటీని తీర్చిదిద్దిన నిర్వాహకులను ఆయన ప్రశంసించారు. దేశంలోని సెజ్‌లలో శ్రీసిటీ బెస్ట్ మోడల్‌గా అభివర్ణించారు. మంచి ఆహ్లాదకరమైన పర్యావరణ వ్యవస్థ, విశాలమైన ప్రాంతంలో ఏర్పాటైన శ్రీసిటీ ప్రపంచ పారిశ్రామిక మార్కెట్‌కు ఎంతో అనువైనదిగా అభివర్ణించారు. శ్రీసిటీ పరిశ్రమకు అవసరమైన సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అనంతరం శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ మంత్రి పర్యటన తమకు ఎంతో విలువైనదని శ్రీసిటీ పట్ల ఆయన సానుకూలతను తెలపడంతో తమకు మరింత ఉత్సాహాన్ని కల్పించిందని అన్నారు. మంత్రి వెంట తిరుపతి ఎంపి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.