శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వినాయకచవితి సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 4: వినాయకచవితి పండుగను పురస్కరించుకుని నెల్లూరు నగరంతో పాటు పట్టణాల్లో ఆదివారం ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది. సోమవారం వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పండుగ సామగ్రి విక్రయించే ప్రాంతాలన్నీ కొనుగోలుదార్లతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా భారీ గణేశ విగ్రహాలను విక్రయిస్తున్న నెల్లూరు నగర మినీ బైపాస్‌రోడ్డు మీద ట్రాక్టర్లు, లారీలు, పలు వాహనాలు విగ్రహాలను తీసుకెళ్లేందుకు బారులు తీరాయి. విగ్రహాలను వాహనాల్లోకి ఎక్కించేందుకు ప్రత్యేకంగా క్రేన్లను అమ్మకందార్లు ఏర్పాటు చేయడం విశేషం. అదేవిధంగా ఆత్మకూరు బస్టాండ్, కూరగాయల మార్కెట్, రామలింగాపురం ప్రాంతాల్లో పూజాద్రవ్యాలు కొనుగోలు చేసే వారితో కిక్కిరిసి కనిపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకూ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూలు, పూజాద్రవ్యాల ధరలు విపరీతంగా పెంచిన వ్యాపారులకు, ప్రజలకు మధ్య కొన్నిచోట్ల స్వల్ప వాగ్వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి.
కాంతులీనిన నగరం
వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరం సుందరంగా ముస్తాబైంది. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ గణేశ ప్రతిమలు నిలిపేందుకు ఆయా ఉత్సవ కమిటీలు పోటీపడి చేసిన ఏర్పాట్లతో నెల్లూరు నగరం కళకళలాడుతూ కనిపిస్తోంది. ముఖ్యంగా గాంధీబొమ్మ, ట్రంక్‌రోడ్, స్టోన్‌హౌస్‌పేట, బాలాజీనగర్, హరనాథపురం, ఆచారి వీధి, కాపువీధి తదితర ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు నిర్వహించే రోజుల్లో భక్తుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసే విషయంలోనూ నిర్వాహకులు పోటీ పడుతుండడం విశేషం.