శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జవాబు సరిలేని జమాఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, సెప్టెంబర్ 4: ఆత్మకూరు పురపాలక సంఘంలో ఆదాయ వ్యయాలపరంగా జవాబుదారీ లోపిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ సమావేశాల్లో భాగంగా గడచిన కాలపు జమాఖర్చుల ప్రతుల్ని కౌన్సిలర్లకు అందజేయడం పరిపాటి. ఆయా ప్రతుల్లో చూపుతున్న ఖర్చులపై పలువురు కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఆరోపణలు సంధిస్తున్నారు. జమా ఖర్చుల ప్రతుల్ని మున్సిపల్ సమావేశంలో ఆశీనులైన కౌన్సిలర్లకు అప్పటికప్పుడు టేబుల్ ఐటమ్‌గా అందజేస్తున్నారు. దీంతో జమాఖర్చులపై కనీస విచారణకు కూడా తావుండటం లేదనేని సభ్యుల వేదనగా ఉంది. సమావేశానికి కొద్దిరోజుల ముందుగా అందజేసే అజెండాతోపాటే జమాఖర్చుల ప్రతుల్ని కూడా పంపవచ్చు కదా అంటూ ఎన్నో పర్యాయాలుగా కౌన్సిలర్లు గోడు వెళ్లబోసుకుంటున్నా పురపాలక అధికార్లకైతే పట్టడం లేదు. ముందుగా అందజేస్తే అవసరమైతే కార్యాలయంలోని ఆయా సెక్షన్లకు వచ్చి రికార్డులు, సంబంధిత బిల్లుల వివరాలను పరిశీలించి కౌన్సిల్ భేటీలో సమ్మతించేందుకు అవకాశాలుంటాయి. అలాగాకుండా సమావేశ ప్రారంభంలో ఇవ్వడం, జమాఖర్చులు ఆమోదిస్తేనే అజెండా చర్చకు వెళ్లే ఏర్పాటును తప్పుబడుతున్నారు. మూడు నెలల క్రితం జరిగిన మున్సిపల్ భేటీలో ఇదేవిధంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమావేశంలో భాగంగా మున్సిపాలిటీలో దోమల నివారణకు మెలాథిన్ స్ప్రే ఎక్కడ జరుగుతుంతో తమకైతే తెలియడం లేదని వాపోయారు. ఆ పేరు చెప్పుకుని రూ. 20 వేల వరకు ఖర్చుల్లో చూపుతూ ఆత్మకూరులోని వెంకట సుప్రజ ఏజెన్సీకి ముట్టచెప్పడాన్ని తప్పుబట్టారు. ప్రైవేట్ ఆటోల్లో చెత్త తరలిస్తుంటే మరో వైపు మున్సిపాలిటీ తరపున సాంబశివ పెట్రోల్ బంకుకు 3నెలలకు 1.15లక్షలు అందజేసిన వైనంపైనా సాక్షాత్తు పురపాలక ఉపాధ్యక్షుడైన సందానీ నిలువెల్లా అనుమానం వెలిబుచ్చారు. వైఎస్‌ఆర్‌సి కౌన్సిల్ పక్ష నేత అల్లారెడ్డి ఆనందరెడ్డి కూడా అదే సందర్భంలో ఖర్చులపై తీవ్రంగా విమర్శించారు. పందులు తరలించినట్లు 2.45లక్షలు వ్యయాల పద్దులో చూపించారు. అంతకుముందు నెలలో కూడా అలాగే ఖర్చుల జాబితాలో పందుల తరలింపునకై భారీ నిధులు వెచ్చించారు. అయినా ఊళ్లో పందుల బెడద మాత్రం తీరడం లేదని వాపోయారు. అసలు పందులు తరలిస్తున్నారా కేవలం నిధులు మాత్రమే తరలించుకుపోతున్నారా అంటూ ఆక్షేపించినా ఆ సమస్య మాత్రం నేటికీ అంతకంతకూ అధిక తీవ్రతతో ఉంది. ఇవన్నీ ఒక్క సమావేశంలో కౌన్సిలర్ల నుంచి వ్యక్తమైన సందేహాల పరంపర. ఆ తరువాత కౌన్సిల్ భేటీ అయి మూడు నెలలవవుతోంది. విరివిగా పాలకవర్గసభలు నిర్వహిస్తే ఆరోపణల పరంపర అధికమవుతుందనే ఉద్దేశంతో సమావేశాలను వీలైనంత వరకు జాప్యం చేసే ధోరణికి తావిస్తోంది. ప్రజల నడ్డివిరిచి పన్నులు వసూలు చేసేటప్పుడు ఆ నిధులను బాధ్యతగా ఖర్చు చేయాలి కదా అంటూ సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పన్నులు అమాంతంగా పెంచిన తరువాత కూడా ఒక్కో నెలకు సంబంధించి జమలు 7 లక్షలు ఉంటే, ఖర్చులు 25 లక్షల వరకు సమీపిస్తున్నాయి. ఖర్చులకు తగ్గట్లు జమలు రావాలంటే ఎలాగనే అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా జమాఖర్చుల ప్రతులు అదనపుఅజెండాగా సమావేశం జరిగేటప్పుడు మాత్రమే అందిస్తామని, ముందుగా పంపించేది లేదని మున్సిపల్ కమిషనర్ మంకుపట్టుతో చెపుకొస్తున్నారు. ఇదేమిటంటే గడచిన సమావేశాల తీర్మానాల్ని అనుసరించి కొన్ని ఖర్చులు చేస్తుంటారు. అలాగాక ర్యాటిఫికేషన్ (ముందస్తు ఆమోదం) లేకుండా జరుగుతున్న ఖర్చులపైనే అధిక రాద్ధాంతం చోటుచేసుకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు తమ బండారాలు బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారని చెప్పాలి. ఇందుకు కౌన్సిల్‌లోని అధికారపక్షంలో కీలకవర్గం మద్దతు కూడా తోడవుతుండటం గమనార్హం.