శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

హెచ్‌ఐవి, ఎయిడ్స్ రోగులకు వైద్యసేవలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, సెప్టెంబర్ 8 : హెచ్‌ఐవి, ఎయిడ్స్ వ్యాధులకు గురైన రోగుల పట్ల వివక్ష చూపకుండా సత్వర వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్-2 సాల్మన్‌రాజ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో గురువారం హెచ్‌ఐవి నివారణ, నియంత్రణ కమిటీతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు హెచ్‌ఐవి, టిబి, ఎయిడ్స్ కార్యక్రమాల్లో భాగస్వామ్యమై పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో హెచ్‌ఐవి రోగులకు అవగాహన కల్పించి వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలన్నారు. వ్యాధిబారిన పడిన వారికి వెంటనే అవసరమైన చికిత్సను అందించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలకు, పిహెచ్‌సీలకు, ఏరియా ఆసుపత్రులకు వచ్చే రోగులకు చికిత్స, సర్జరీలు జరిపించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో సర్జరీ చికిత్సకు అవసరమైన మెడికల్ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్‌ఐవి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వైద్యంతోపాటు జీవనోపాధిని కల్పించాలన్నారు. వ్యాధిగ్రస్తులు కొందరు భయపడుతూ నివాసాల నుంచి బయటకు రావడం లేదని ఇలాంటి వారిని గ్రామపెద్దలు సమన్వయంతో గుర్తించాలన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తమవంతు సహకారం అందించాలన్నారు. ఆశా, అంగన్‌వాడి, పొదుపు మహిళల సహకారంతో వ్యాధిబారిన పడిన గర్భవతులను విఆర్‌టి సెంటర్‌లో వారి పేరు నమోదు అయ్యేవిధంగా చేయడం, ప్రభుత్వ వైద్యశాలలో కాన్పు అయ్యేవిధంగా ప్రోత్సహించి మాతాశిశు మరణాలను తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డిఎంహెచ్‌ఓ డాక్టర్ రమాదేవి, వైద్య కళాశాల ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలదేవి, టిబి కంట్రోల్ అధికారి సురేష్‌కుమార్, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.