శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రూ.3 లక్షల ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాపూరు, ఏప్రిల్ 12: రాపూరు మండలం పంగిలి గ్రామ సమీపంలోని వెలుగొండ అటవీ ప్రాంతంలో రాపూరు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా ఎర్రచందనం స్మగ్లర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి గాలిస్తుండగా ఓ ముళ్లపొదలో రవాణాకు సిద్ధం చేసి నిల్వ ఉంచిన 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో గూడూరు డిఎస్పీ శ్రీనివాసులు వివరించారు. ఇటీవల పొరుగు జిల్లాలైన కడప, చిత్తూరు ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమశాఖ సిబ్బంది రెండు రోజులుగా వెలుగొండ అడవుల్లో ప్రత్యేక పోలీస్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. కూంబింగ్‌లో భాగంగా వెలుగొండ అటవీ ప్రారంభంలోని పంచళ్ల వాగువద్ద అక్రమ రవాణాకు నిల్వ ఉంచిన 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టగా కొందరు పరారుకాగా ఒకరు దొరికారని చెప్పారు. పట్టుబడ్డ నిందితుడు కరుడుగట్టిన స్మగ్లర్ అని ఇతను పంగిలి గ్రామానికి చెందిన సంగటి వెంకటయ్య అని పేర్కొన్నారు. ఇప్పటికే ఇతనిపై స్థానిక స్టేషన్లో మూడు ఎర్రచందనం కేసులతోపాటు, అటవీ శాఖలో కూడా మరో రెండు కేసులు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ సుమారు మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అడవులతోపాటు మరెక్కడయినా నేరాలకు సంబంధించి సమాచారం తెలిసినా, అసాంఘిక కార్యక్రమాలు జరిగినా స్థానిక పోలీస్‌స్టేషన్లో తెలియజేయాలన్నారు. తెలియజేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు. జిల్లాఎస్పీ ఆదేశాల మేరకు రెండు మూడు రోజుల్లో ప్రతి పోలీస్ కానిస్టేబుల్ విధిగా మండలంలోని ఒక గ్రామంలో నిద్ర చేయాలన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో వెంకటగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్సై శ్రీనివాసరావు, రాపూరు సబ్ ఇన్‌స్పెక్టర్లు కరీముల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.