శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేడు న్యాయవాదులు కోర్టు విధుల బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు లీగల్, సెప్టెంబర్ 13: జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం జరిగిన బాంబు పేలుడు ఘటనను నిరసిస్తూ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ నెల్లూరు న్యాయవాదులు బుధవారం కోర్టు విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. నెల్లూరు బార్ అసోసియేషన్‌లో మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ బాంబు పేలుడు సంఘటనపై మొక్కుబడి విచారణ కాకుండా త్వరితగతిన విచారణ జరిపి సంఘటనపై నిజానిజాలు రాబట్టడానికి ప్రయత్నించాలని కోరారు. ఈ సంఘటన తరువాత జిల్లా కోర్టు ఆవరణలో భద్రత పెంచాల్సిన అవసరం కూడా ఉందని వారు పేర్కొన్నారు. నెల్లూరు న్యాయవాదులకు సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ బార్ అసోసియేషన్‌లు కూడా కోర్టు విధులు బహిష్కరించి తమకు మద్దతు తెలపాలని బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ రోజారెడ్డి పిలుపునిచ్చారు.
లాయర్స్ యూనియన్ ఖండన
జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడు సంఘటనను ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. ఐలూ రాష్ట్ర అధ్యక్షులు నర్రా శ్రీనివాసరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ, ఐలు వ్యవస్థాపక అధ్యక్షులు బివి రమణారెడ్డి తదితరులు మాట్లాడుతూ, జిల్లా కోర్టు ఆవరణలో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోందని, ఇకమీదట పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కోర్టు ఆవరణలో షటిల్‌మెంట్లు చేసేందుకు బయట నుంచి వచ్చి ఇక్కడ చర్చలు సాగిస్తుంటారని వారిని కట్టడి చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బార్ అసోసియేషన్ హాల్‌ను సాయంత్రం ఏడు గంటలకు మూసివేయాలన్నారు. బార్ అసోసియేషన్ హాల్లోకి కొత్త వ్యక్తులు వస్తుంటారని దీని ద్వారా వారు రాకుండా కట్టడిచేయవచ్చని వారు కోరారు. ఏదిఏమైనా పేలుడు సంఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికితీయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా శాఖ ఐలూ జిల్లా అధ్యక్షులు సాల్మన్‌రాజ్ ఈ సంఘటనను ఖండించారు.