శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

భక్తిశ్రద్ధలతో బక్రీద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 13: ప్రేమ, త్యాగాలకు మారుపేరైన బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని ఈద్గాలు, మసీదుల వద్ద మంగళవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. నగరంలో పలుచోట్ల నిర్వహించిన బక్రీద్ ప్రార్థనల్లో ప్రజా ప్రతినిథులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికి మంచి జరగాలని, సుఖసంతోషాల అభివృద్ధికి అల్లా దయ ఉండాలని, మానవులందరూ ఐకమత్యంగా మెలగాలన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్ పర్వదినాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. అన్నిచోట్ల నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం, విద్యుద్దీపాలంకారణ, షామియానాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా ముస్లింలు ఆహారాన్ని పంచిపెట్టారు. బక్రీద్ పర్వదినాన అల్లాపై అపారమైన నమ్మకంతో భక్తిశ్రద్ధలు కనబరచాలని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమాల్లో నగర, గ్రామీణ ఎమ్మెల్యేలు డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.