శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 12: జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పి విశాల్ గున్నీ తెలిపారు. మంగళవారం నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఎస్‌పి విశాల్ గున్నీ విలేఖర్లకు ఈ సంఘటన వివరాలను వెల్లడించారు. బొలెరో వాహనంలో ఎర్రచందనం దుంగలను ఎగుమతి చేసి నెల్లూరుకు తరలించే సమయంలో ఆత్మకూరు సిఐ ఎస్‌కె ఖాజావలికి అందిన ముందస్తు సమాచారం మేరకు నెల్లూరుపాళెం సెంటర్, ఆత్మకూరు వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారన్నారు. నిందితులు నెల్లూరుపాళెం వద్ద కారును ఆపకుండా పారిపోతుండగా పోలీసు సిబ్బంది కారును వెంబడించి పట్టుకొనే సమయంలో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని చెప్పారు. మిగిలిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 55 లక్షల రూపాయలు విలువ చేసి సొత్తును రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 44.50 లక్షల రూపాయలు, 23 ఎర్రచందనం దుంగలు, వాటి విలువ 5.50 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల విలువ చేసే బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్గొన్నారు. గత రెండు నెలల క్రితం గుద్దేడి రామనాధరెడ్డి (వింజమూరు) మర్రిపాడు, అనంతసాగరం సోమశిల అటవీ ప్రాంతాలలో ఎర్రచందనం దుంగలను సరఫరా చేసినట్లు వారికి సంబంధించిన లావాదేవీల నగదు అని ఆత్మకూరు సిఐ నిర్ధారించి తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీన పరుచుకున్నట్లు చెప్పారు. ఎర్రచందనం కేసులో నెల్లూరు హరనాధపురానికి చెందిన ప్రవీణ్, రామకోటినగర్‌కు చెందిన పొదిలి నాగరాజు, రాపూరుకు చెందిన భూదూరు లోకేష్, ఎర్రబల్లిపాళెం చెందిన వెంకటకృష్ణారెడ్డిని పోలీసులు అదపులో తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ సమావేశంలో ఆత్మకూరు డిఎస్పీ కెఎస్‌ఎస్‌వి సుబ్బారెడ్డి, ఆత్మకూరు సిఐ షేక్ ఖాజావలి, ఎఎస్సై ఎస్ సాయిప్రసాద్, కానిస్టేబుళ్లు పి చెన్నకేశవ, పి శ్రీనివాసులు, డి అశోక్, ఎం సునీల్‌బాబు, కె శ్రీ్ధర్‌ను జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అభినందించారు.