శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, సెప్టెంబర్ 27 : ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, జూలై నుంచి పెరిగిన డిఏను అరియర్స్‌తోపాటు చెల్లించాలని ఏపిఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టిసీ నష్టాలకు అధికారుల ఏకపక్ష నిర్ణయాలే కారణమంటూ ఇందుకు నిరసనగా ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు రెండు రోజులపాటు రాష్టవ్య్రాప్తంగా అన్ని ఆర్టిసీ బస్టాండుల్లో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండులో మంగళవారం ఆ యూనియన్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.నారాయణరావు మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాలకు అధికారుల ఏకపక్ష నిర్ణయాలే కారణమన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్టీసీలో ఇప్పటికే ఎక్కువగా ఉన్న అధికారుల సంఖ్య తగ్గించాల్సిందిపోయి అందుకు విరుద్ధంగా యాజమాన్యం కొత్తకొత్త పోస్టులను సృష్టించి అధికారుల సంఖ్యను అన్ని స్థాయిల్లోనూ పెంచుకుంటూ పోతుండడం దారుణమన్నారు. ఖాళీ ఉన్నచోట్ల కూడా రెగ్యులర్ సిబ్బందిని నియమించకుండా ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించడం తగదన్నారు. ఆర్టీసీలో తక్కువ ఆదాయం వస్తున్న రూట్లలో తిరుగుతున్న సిబ్బంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని షెడ్యూళ్లలో మార్పులు చేయకుండా అధికారులు వారిష్టానుసారంగా మార్పులు చేయడం సరికాదన్నారు. ఇయుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎంటిడబ్ల్యూ యాక్టు పరిధిలో షెడ్యూల్స్‌ను సవరించాలన్నారు. మిగిలి ఉన్న కాంట్రాక్టు డ్రైవర్‌లు, కండక్టర్‌లను రెగ్యులర్ చేయాలన్నారు. మహిళా కండక్టర్లకు ప్రత్యేక డ్యూటీ చార్టులు వేయాలన్నారు. గుర్తింపు సంఘం నాయకులకు ఫ్రీ మస్టర్స్ ఇచ్చే విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు. నెల్లూరు రీజియన్ ప్రధానకార్యదర్శి విఎస్ రావ్, జాయింట్ సెక్రటరి మల్లికార్జునరావు, ఒకటి, రెండు డిపోల కార్యదర్శులు అంకెం వెంకటేశ్వర్లు, ప్రసాద్ ప్రసంగించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలుపరచలేని గుర్తింపు సంఘాన్ని ప్రశ్నించండి.. కార్మిక సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పడుతున్న ఇయుకు మద్దతు పలకండి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.