శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆటోడ్రైవర్ నిజాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 15: తన ఆటోలో ప్రయాణికుడు మరచిపోయిన బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించడం ద్వారా ఒక ఆటో డ్రైవర్ ఎస్పీ అభినందనలు అందుకున్నాడు. వివరాల్లోకి వెళితే... స్థానిక చింతారెడ్డిపాలెంకు చెందిన కాయల రఘు అనే యువకుడు నగరంలో ఆటో(నెం. ఏపి26 టిజి 4327) నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గూడూరుకు చెందిన మురారిరెడ్డి శుక్రవారం నెల్లూరుకు వచ్చి బాలాజీనగర్‌లోని తన బంధువులను కలుసుకునే నిమిత్తం మినీ బైపాస్ రోడ్ వద్ద రఘు ఆటో ఎక్కాడు. బాలాజీనగర్‌లోని స్వామిదాస్ స్కూల్ సమీపంలో ఆటో దిగిన మురారిరెడ్డి బాడుగ చెల్లించి వెళ్లిపోయాడు. రఘు కూడా తన దారిన తాను ఆటో నడుపుకుంటూ వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తాను ఆటోలో సూట్‌కేసు మర్చిపోయినట్టు గుర్తించిన మురారిరెడ్డి బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూట్‌కేసులో సుమారు రూ.10లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.40వేలు నగదు, విలువైన లాప్‌టాప్, ఐఫోన్ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు విచారణ ప్రారంభించేలోగానే రఘు తన ఆటోలో ఒక ప్రయాణికుడు సూట్‌కేసు మర్చిపోయాడంటూ బాలాజీనగర్ పోలీసులకు వద్దకు వచ్చాడు. దీంతో అతన్ని అభినందించిన బాలాజీనగర్ సిఐ రామారావు విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. మురారిరెడ్డి సూట్‌కేసు పరిశీలించి చూసుకోగా అన్నీ భద్రంగానే ఉన్నట్లు గుర్తించాడు. ఎస్పీ సమక్షంలో సూట్‌కేసును బాధితుడికి అందచేశారు. అనంతరం రఘు నిజాయితీని మెచ్చుకొని ఎస్పీ విశాల్ గున్ని అతన్ని అభినందించి రూ.5వేలు నగదు బహుమతిని అందచేశారు. నిజాయితీగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించడంలో రఘుని ఇతర ఆటో డ్రైవర్లు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర డిఎస్పీ జె.వి.రాముడు, ఎస్బీ డిఎస్పీ కోటారెడ్డి, సిఐ రామారావు తదితరులు ఉన్నారు.