శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వంతెనలు నిర్మించే వరకు పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, అక్టోబర్ 4: జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న బుజబుజనెల్లూరు, కనపర్తిపాడు, ఎన్‌టిఆర్‌నగర్, రాజుపాలెం ప్రాంతాల్లో వంతెనలు, సర్వీసు రోడ్లు నిర్మించేంత వరకు పోరాటం సాగిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైన తెలిపిన ప్రాంతాల్లో ఒక ఏడాది కాలంలో రోడ్డు ప్రమాదంలో 52 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దీగా ఉన్న ప్రాంతాలలో వంతెనలు, సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జాతీయ రహదారి సంస్థకు ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి వసతులు కల్పించకుండా టోల్ ఫీజు ఎలా వసూలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా 6వ తేదీన బుజబుజనెల్లూరు ప్రాంతంలో రాస్తారోకో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉద్యమాన్ని మూడు దశల్లో నిర్వహిస్తామన్నారు. జాతీయ రహదారి సంస్థ తలవంచేవరకు ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటే ఎవరూ పట్టించుకోకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అఖిలపక్షంతో సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాటి వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.