శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అన్నపూర్ణ అలంకారంలో రాజరాజేశ్వరిదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 4: స్థానిక దర్గామిట్టలోని రాజరాజేశ్వరిదేవి దేవస్థానంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో నాల్గవరోజైన మంగళవారం అన్నపూర్ణ అవతారంలో నయనానందకరంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తన్మయం చెందారు. ఈ ఉత్సవానికి చెన్నై నగరానికి చెందిన దేవిరెడ్డి శైలజమ్మ కుటుంబీకులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అంతక్రితం ఉదయం అమ్మవారికి నవావరణ, అష్టోత్తర, సహస్రనామ పూజలు శాస్త్రోక్తంగా దేవస్థాన ప్రధాన అర్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో జరిగాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాం, సహాయ కమిషనర్ పి.కోదండరామిరెడ్డిలు ఉత్సవాలను పర్యవేక్షించారు. సాయంత్రం భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా డిజె ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో పాటకచేరి, స్వరగోపురం ఎంటర్‌టైన్‌మెంట్ వారి భక్తి పాటలు భక్తులను అలరించాయి.
నేడు గజలక్ష్మి అలంకారం
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాజరాజేశ్వరిదేవికి గజలక్ష్మీ అలంకారం చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వాహకులు తెలిపారు.